కరోనా వైరస్ పిల్లలకు ఎందుకు సోకదంటే? అసలు సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు!

  • Published By: sreehari ,Published On : March 4, 2020 / 05:55 AM IST
కరోనా వైరస్ పిల్లలకు ఎందుకు సోకదంటే? అసలు సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు!

Updated On : March 4, 2020 / 5:55 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ 90వేల మందికి సోకగా, 3వేల మందిని పొట్టనబెట్టుకుంది. ఇప్పటివరకూ కరోనా సోకినవారిలో చాలా తక్కువ మంది పిల్లల్లో ఈ వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. అందులో కూడా స్వల్ప స్థాయిలో మాత్రమే వైరస్ లక్షణాలు కనిపించినట్టు తెలిపారు. పెద్దవాళ్లను మాత్రమే పట్టి పీడుస్తున్న ఈ మహమ్మారి వైరస్.. చిన్న పిల్లల పట్ల ఎందుకింత జాలి చూపిస్తుంది? అనేదానిపై సైంటిస్టులు ఎంతో ఆసక్తిగా పరిశోధనలు జరుపుతున్నారు.

చైనాలోని వుహాన్ సిటీలో ఉద్భవించిన ఈ కరోనా వైరస్ (COVID-19) చిన్నపిల్లల్లో కేవలం 2.4 శాతం మాత్రమే కేసులు నమోదు అయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా జాయింట్ మిషన్ ఈ రిపోర్టును వెల్లడించింది. కరోనా సోకిన చిన్నారుల్లో 2.5 శాతం మందికి మాత్రమే వైరస్ లక్షణాలు కనిపించగా, వారిలో 0.2 శాతం మాత్రమే వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నట్టు పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ వైరస్ కారణంగా చిన్నారులు మరణించినట్టుగా ఒక రిపోర్టు లేదు. చిన్నారుల విషయంలో కరోనా వైరస్ క్షమాగుణం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ ఎందుకు పిల్లలకు సోకడం లేదన్నది మిస్టరీగా మారడంతో పెడియాట్రిక్ వైద్య నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. లోతుగా పరిశోధిస్తున్నప్పటికీ ఇప్పటివరకూ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. పెడియాట్రిక్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ స్పెషలిస్టు ఫ్రాంక్ ఎస్పెర్ మాట్లాడుతూ.. సాధారణ కరోనా వంటి చాలా వైరస్‌లు పిల్లలు, పెద్దల్లో ఒకేలా వ్యాపిస్తాయి.. కానీ, ఈ కరోనా వైరస్ విషయంలో కారణం ఏదైనా కావొచ్చు..(Amazon డెలివరీ బాయ్‌కు కరోనా)

పిల్లల కంటే పెద్దల్లోనే వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దల్లో వ్యాధినిరోధక వ్యవస్థలో వ్యత్యాసం ఏంటి? అనేదానిపై Dr. Vanessa Raabe, assistant professor pediatric and adult infectious diseases at NYU Langone సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు.  

వయస్సు రీత్యా కూడా వైరస్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని ఆమె అన్నారు. చిన్నపిల్లల్లో (ఆటలమ్మ) చికెన్ ఫాక్స్ వంటి ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. అయినా పెద్దగా ప్రాణాంతకం కాదు.. అదే పెద్దల్లో చాలా సందర్భాల్లో ఇలాంటి వైరస్ మరింత తీవ్రంగా ఉంటుందని ఆమె చెప్పారు.

చిన్నారుల్లో ఎక్కువగా జలుబు, దగ్గు వంటి ఎక్కువగా వస్తుంటాయి. పిల్లలో శరీరంలోని రక్తకణాల్లో యాండీబాడీస్ చురుకుగా ఉంటాయి. వ్యాధులను కలిగించే వైరస్‌లను నిరోధించేందుకు ఎప్పటికప్పుడూ వ్యాధినిరోధక వ్యవస్థను పటిష్టంగా మార్చుకుంటుందని Vanderbilt Children’s Hospital, pediatric infectious diseases  associate professor Buddy Creech తెలిపారు. అందుకే పిల్లల్లోకి ఏదైనా కరోనా వైరస్ సోకితే వెంటనే వారిలోని వ్యాధినిరోధక వ్యవస్థ అప్రమత్తమై వైరస్‌ల పై ప్రతిదాడి చేస్తుంటుందని చెప్పారు. పిల్లల్లోని వ్యాధి నిరోధక వ్యవస్థ వేగవంతంగా పనిచేస్తూ వారికి రక్షణ కవచంలా ఉంటోందని వైద్య నిపుణులు వెల్లడించారు.

పెద్దలలో ఎక్కువగా కరోనా వైరస్ సోకడానికి వారిలో దురాలవాట్లే ప్రధాన కారణమన్నారు. స్మోకింగ్ వంటి చెడు అలవాట్ల కారణంగా వారిలోని వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడుతోందని, దాని కారణంగానే వైరస్ లు వేగంగా వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు. అదే పిల్లల్లో అయితే అలాంటి సమస్యలు లేవని అందుకే పిల్లల్లో కరోనా వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటోందని సైంటిస్టులు అంటున్నారు.