Health Tips: పెరుగు తింటే నిద్ర బాగా పడుతుంది అంటారు.. కానీ, జరిగేది ఇదే.. జాగ్రత్తలు అవసరం

Health Tips: పెరుగు‌లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత సిరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్‌ మిటర్‌కు మారుతుంది.

Health Tips: పెరుగు తింటే నిద్ర బాగా పడుతుంది అంటారు.. కానీ, జరిగేది ఇదే.. జాగ్రత్తలు అవసరం

What are the reasons why eating yogurt makes you sleepy?

Updated On : July 31, 2025 / 4:50 PM IST

పెరుగు అనేది మన రోజువారీ ఆహారంలో భాగంగా మారిపోయింది. ఎం తిన్నా.. ఎంత తిన్నా చివరికి పెరుగు లేకపోతే ఎదో వెలితిగానే అనిపిస్తుంది. అంతలా పెరుగుకి అలవాటు పడిపోయారు. ఇది కేవలం రుచి కోసమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే, చాలామందికి పెరుగు తిన్న తర్వాత మత్తుగా అనిపించడం, నిద్ర రావడం జరుగుతుంది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలన్నాయని నిపుణులు చెప్తున్నారు. మరి ఆ విషయాలు ఏంటి? పెరుగు తింటే నిద్ర ఎందుకు వస్తుంది? అనేదాని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

పెరుగు తింటే నిద్ర రావడానికి కారణాలు:

1.ట్రిప్టోఫాన్ ప్రభావం:
పెరుగు‌లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత సిరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్‌ మిటర్‌కు మారుతుంది. సిరోటోనిన్ మూడ్‌ను మెరుగుపరచడంలో, శరీరానికి మత్తు రావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సిరోటోనిన్ మరింతగా మెలటొనిన్ అనే హార్మోనుకు మారి నిద్రను ప్రేరేపిస్తుంది. అందుకే పెరుగు తిన్న తర్వాత శాంతిగా అనిపించి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది.

2.శరీర ఉష్ణోగ్రత తగ్గడం:
పెరుగు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. అలా తగ్గినప్పుడు శరీరం సహజంగా నిద్రించేందుకు సిద్ధమవుతుంది. న్యూరో సైకలాజికల్ ప్రకారం ఇది సహజమైన నిద్ర.

3.జీర్ణ వ్యవస్థపై ప్రభావం:
పెరుగు ప్రోబయోటిక్‌లతో నిండి ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, శరీరంలో శాంతియుత స్థితిని కలుగజేస్తుంది. శరీర శ్రమ తక్కువగా అనిపించడంతో మానసికంగా రిలాక్స్ అయి నిద్ర వచ్చే అవకాశం పెరుగుతుంది.

4.కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మిశ్రమ ప్రభావం:
పెరుగు అనేది ఒక మిశ్రమ ఆహారం. ఇందులో ప్రోటీన్, కొంతమేర కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది మన శరీరానికి తృప్తినిచ్చే ఆహారంగా పని చేస్తుంది. ఇది పేగు, మెదడు సంబంధం ద్వారా నిద్రను ప్రభావితం చేస్తుంది.

అప్రమత్తతగా ఉండాల్సిన విషయాలు:

  • నిద్ర అనుకూలంగా పెరుగు పని చేస్తేనే మంచిదే కాని, ప్రతి ఒక్కరికి ఇది విధంగా పనిచేస్తుందనే సూచన లేదు.
  • కొంతమందికి రాత్రి పెరుగు తినడం జీర్ణ సమస్యలు, శ్లేష్మం ఎక్కువ కావడానికి కారణం కావచ్చు.
  • కొంతమంది తమ శరీర స్వభావాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం మంచిది.

పెరుగు తినడం వల్ల కొందరికి నిద్ర రావడం అనేది శరీరంలో హార్మోనల్, న్యూరోకెమికల్ మార్పుల వల్ల జరుగుతుంది. ట్రిప్టోఫాన్, సిరోటోనిన్, మెలటొనిన్ వంటి మూలకాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ఇది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా పనిచేయకపోవచ్చు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు అవసరం.