Kidney Stone Problem: చిన్న వయసులోనే కిడ్నీ రాళ్లు ఎందుకు వస్తున్నాయి? తెలుసుకోండి.. జాగ్రత్తలు పాటించండి
Kidney Stone Problem: కిడ్నీల్లో రాళ్లు అనేది సాధారణంగా పెద్దల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, ఈ మధ్య కాలంలో చిన్నారుల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

Causes of kidney problems in children
కిడ్నీల్లో రాళ్లు అనేది సాధారణంగా పెద్దల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, ఈ మధ్య కాలంలో చిన్నారుల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. శరీరంలో ఉండే ఖనిజాలు, వ్యర్థ పదార్థాలు, కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్ వంటి పదార్థాలు సరిగా బయటకు వెళ్లకపోవడం వల్ల అవి గడ్డకట్టి రాళ్ల (Kidney Stones) లాగా ఏర్పడతాయి. ఇది చిన్నారులకు తీవ్రమైన నొప్పిని, మూత్ర సంబంధిత ఇబ్బందులను కలిగిస్తుంది. మరి పిల్లల్లో ఈ సమస్య ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటి? నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లల్లో కిడ్నీ రాళ్లకు ముఖ్య కారణాలు:
1.తక్కువగా నీరు తాగడం:
వివిధ కారణాల వల్ల పిల్లలు తగినంత నీరు తాగరు. పిలల్లు రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి. ఇలా ఎక్కువగా నీళ్లు తాగకపోవడం వల్ల మూత్రపిండాల్లో మలినాలు పెరిగి రాళ్లలాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, శరీరానికి అవసరమైన నీరు తాగాలి.
2.అధిక ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం:
పిల్లలకు చాలా మంది స్నాక్స్ తినిపిస్తారు.వాటిలో ఎక్కువ ఆయిల్స్, జంక్ ఫుడ్, సాల్టీ ఐటమ్స్ అధికంగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలో సోడియం, కాల్షియం నిలువ ఉండి రాళ్లుగా మారతాయి.
3.జెనెటిక్ కారణాలు:
కొన్ని సందర్భాల్లో ఆహారపు అలవాట్ల వల్ల కాకుండా తల్లిదండ్రుల్లో ఏవైనా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే, పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
4.యూరిన్ ఇన్‌ఫెక్షన్లు:
పిల్లల్లో చాలా మంది యూరిన్ ను ఎక్కువసేపు ఆపుకుంటారు. ఇలా ఎక్కువగా యూరిన్ ను ఎక్కువగా ఆపడం వల్ల అది మూత్రపిండాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మూత్ర నాళాల్లో ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
5.కొన్ని మెడికల్ పరిస్థితులు:
హైపర్‌కాల్స్యూరియా, సిస్టినూరియా లాంటి మెటబాలిక్ సమస్య వల్ల కూడా కిడ్నీలో రాళ్ల సమస్యకు కారణమవుతాయి.
పిల్లల్లో కిడ్నీ రాళ్లు ఉన్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు:
- వెన్ను భాగంలో లేదా పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది
- మూత్రం రంగు మారడం (పింక్ లేదా రెడ్ కలర్ లో మూత్రం వస్తుంది)
- తరచూ మూత్రం రావడం, లేదా మూత్రం రాకపోవడం
- మూత్రంలో దుర్వాసన రావడం, మంట రావడం
- వాంతులు, ఉబ్బసం రావడం
- జ్వరం (ఇన్‌ఫెక్షన్ వల్ల), అలసటగా ఉండటం, ఏడవడం, తినకపోవడం వంటి లక్షణాలను గమనించాలి.
నివారణ చర్యలు:
1.ఎక్కువ నీరు తాగించండి:
పిల్లలకు రోజుకు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగేటట్లు చూసుకోండి.
2.ఆహార నియంత్రణ:
ఉప్పు తక్కువగా ఉండే ఆహారాన్ని అందించాలి. ప్రాసెస్డ్, ఫాస్ట్ ఫుడ్, కార్బొనేటెడ్ డ్రింక్స్ తక్కువగా ఇవ్వండి. కాల్షియం, మగ్నీషియం, విటమిన్ B6 ఉన్న ఆహారాలను ఎక్కువగా ఇవ్వండి.
3.ఫిజికల్ యాక్టివిటీ:
శారీరక శ్రమ మెటబాలిజం మెరుగవుతుంది. దీనివల్ల మినరల్స్ సమతుల్యం అవుతాయి.
పిల్లల్లో కిడ్నీలో రాళ్ల సమస్య తీవ్రం కాకముందే గుర్తించాలి. తగిన ఆహారం, నీరు, శుభ్రతగా ఉండేలా చూసుకోవాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు ఈ సమస్యల నుంచి తేలికగా బయటపడతారు.