కరోనా పంజా, తెలంగాణలో 33కి చేరిన పాజిటివ్ కేసులు, ఒక్కరోజే 6 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సోమవారం(మార్చి 23,2020)

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సోమవారం(మార్చి 23,2020)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సోమవారం(మార్చి 23,2020) ఒక్క రోజే 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 33కి చేరింది. మంత్రి ఈటల రాజేందర్ ఈ విషయాన్ని తెలిపారు. బాధితులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒక్కరు కూడా వెంటిలేటర్ పై లేరని మంత్రి ఈటల తెలిపారు. 97 అనుమానిత కేసులు ఉన్నాయన్న మంత్రి, రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.
బతికుంటే బలుసాకు తినొచ్చు:
బతికుంటే బలుసాకు తినొచ్చన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ లాక్ డౌన్ కు పిలుపునిచ్చారని మంత్రి ఈటల చెప్పారు. మార్చి 31 వరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, వైరస్ బారి నుంచి కాపాడుకోవాలన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు గుంపులుగా రాకుండా ఇంటికొకరు చొప్పున నిత్యవసరాల కోసం బయటకు రావాలని మంత్రి కోరారు.
రోడ్డుపైకి వస్తే కేసులు, తెలంగాణలో రెండు కాంటాక్ట్ కరోనా కేసులు:
కరోనా వైరస్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. కొందరు పని లేకపోయినా రోడ్లపైకి వస్తున్నారని మంత్రి మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు పెడతామన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సెలవులు లేవన్నారు. క్వారంటైన్ లో ఉన్న వాళ్లు ప్రజల్లోకి వెళ్లొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజల్లోకి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో కరోనాతో ఒక్కరు కూడా చనిపోలేదన్న మంత్రి ఈటల కరోనా సోకిన వారందరూ కోలుకుంటున్నారని తెలిపారు.
ఇటలీలో కరోనా పరిణామాల దృష్ట్యా సీఎం కేసీఆర్ మన యంత్రాంగాన్ని అలర్ట్ చేశారని మంత్రి ఈటల చెప్పారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అసాధరణ నిర్ణయాలు తీసుకుంటోందని, దయచేసి ప్రజలంతా మార్చి 31 వరకు ఇళ్లలోనే ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ట్రీట్ మెంట్ కంటే సంరక్షణ ముఖ్యం అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు కాంటాక్ట్ కరోనా కేసులు నమోదయ్యాయమని మంత్రి తెలిపారు. హైదరాబాద్ లో ఒకరికి, కరీంనగర్ లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు.
See Also | లాక్‌డౌన్ వల్ల ప్రమాదాలు ఇవే..