టీవీ నటి కూడా : మద్యం తాగి స్టేడియంలో యువతుల వీరంగం

  • Published By: venkaiahnaidu ,Published On : April 22, 2019 / 04:40 AM IST
టీవీ నటి కూడా : మద్యం తాగి  స్టేడియంలో యువతుల వీరంగం

Updated On : April 22, 2019 / 4:40 AM IST

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం(ఏప్రిల్-21,2019) కోల్ కతా నైట్ రైడర్స్,సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మద్యం మత్తులో ఆరుగురు యువతీ,యువకులు స్టేడియంలో వీరంగం సృష్టించారు.వీరిలో తెలుగు టీవీ యాక్టర్ ప్రశాంతి కూడా ఉన్నారు.మ్యాచ్ చూసేందుకు వచ్చిన యువతీ,యువకులు మ్యాచ్ జరుగుతుండగా మద్యం తాగి హంగామా సృష్టించారు.
Also Read : బాప్ ఏక్ నెంబర్..బేటా దస్ నెంబర్ : జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు

అక్కడే ఉన్నవారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు దిగారు.అక్కడే ఉన్న భరత్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ ఉపాధ్యాయ(41)ను మ్యాచ్ చూడనీయకుండా అడ్డుకున్నారు.దీంతో సంతోష్ ఉప్పల్ పోలీసులకు కంప్లెయింట్ చేశారు.తనను అసభ్యపదజాలంతో తిట్టారని,భయపెట్టారని కంప్లెయింట్ లో తెలిపాడు.ఆరుగురిపైన కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.