లింగంపల్లి – కాకినాడ సువిధ రైలు

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్‌లను నడుపుతోంది. ఇప్పటికే 13 రైళ్లను ప్రత్యేక ఛార్జీల రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైలును ప్రకటించింది. జనవరి 11వ తేదీన లింగంపల్లి – కాకినాడ (82728) స్పెషల్ ట్రైయిన్ లింగంపల్లి నుండి బయలుదేరుతుందని వెల్లడించింది. సాయంత్రం 4.30గంటలకు బయలుదేరి…మరుసటి రోజు ఉదయం 4గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. బేగంపేట..సికింద్రాబాద్..కాజిపేట..ఖమ్మం..రాయపాడు..ఏలూరు..తాడేపల్లిగూడెం..నిడదవోలు..రాజమండ్రి…సామర్లకోట స్థానాల్లో హోల్డింగ్ అవకాశం కల్పించారు.