దసరా ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు 

  • Published By: chvmurthy ,Published On : September 25, 2019 / 05:05 AM IST
దసరా ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు 

Updated On : September 25, 2019 / 5:05 AM IST

బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళకు వెళ్లే ప్రయాణికుల రద్దీ తట్టుకునేందుక టీఎస్ ఆర్టీసీ 4వేల 933  ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

సెప్టెంబర్ 27నుంచి అక్టోబరు 7 వరకు ఈ సర్వీసులు ప్రజలు అందుబాటులో ఉంటాయి.  హైదరాబాద్ నుంచి తెలంగాణ లోని ప్రముఖ పట్టణాలకే కాక ఏపీ, బెంగుళూరు, షిర్డీ,ముంబై, చెన్నై నడిపేందుకు ఆర్టీసీ అధికారులు  ప్రణాళిక రూపోందించారు.

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంజీబీఎస్, జేబీఎస్,  దిల్షుక్ నగర్ బస్టాండ్లతో పాటు లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్ బీ ఎస్సార్ నగర్, అమీర్ పేట, లక్డీ కపూల్, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీ నగర్ నుంచి ఈ  ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు చెప్పారు.