కేటీఆర్‌కు అనసూయ రిక్వెస్ట్‌: సోషల్ మీడియాలో సెటైర్లు, ట్రోల్స్

  • Published By: vamsi ,Published On : March 23, 2020 / 05:25 AM IST
కేటీఆర్‌కు అనసూయ రిక్వెస్ట్‌: సోషల్ మీడియాలో సెటైర్లు, ట్రోల్స్

Updated On : March 23, 2020 / 5:25 AM IST

న్యూస్ ఛానెల్ యాంకర్‌గా టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, జబర్దస్త్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, సినిమా రంగంలో రాణిస్తున్న అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుంది. తెలుగు యాంకర్స్‌లో టాప్‌లో ఉండి, తన అంద చందాలతో పాటు చురుకైన మాటలతో అదరగొట్టే ఈ భామ అప్పుడప్పుడూ కాంట్రవర్శీలకు కేరాఫ్ అవుతుంది. సంవత్సరానికి కోట్లలో సంపాదించే ఈ భామ కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రతలపై ప్రచారం చేస్తూనే… ఈ వైరస్ విస్తరించకుండా.. రాష్ట్ర్ంలో షట్‌డౌన్‌ చెయ్యడంపై ట్విట్టర్ వేదికగా స్పందించింది. 

ఏకంగా మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఓ రిక్వెస్ట్ చేసింది. కేటీఆర్ సర్.. ప్రభుత్వం చెప్పింది పాటించాలి.. కానీ, కొన్ని ప్రొఫెషన్స్ విషయంలో మాత్రం ఈ పద్ధతులు సడలించండి అంటూ విజ్ఞప్తి చేసింది. మేం పని చేయకపోతే మాకు డబ్బులు రావు.. కానీ, మేం మా ఇంటి రెంట్ కట్టుకోవాలి.. కరెంట్ బిల్లు కట్టుకోవాలి.. ఈఎంఐ భరించాలి. నెలసరి బిల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి, కాస్త మాపై దయ చూపించండి అంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేసింది అనసూయ.

అయితే, అనసూయ ట్వీట్‌పై ఒక్కొక్కరు ఒకోలా స్పందిస్తున్నారు. కొందరు ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. పాపం పూర్ లేడీ.. కరెంట్ బిల్లు, ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉందంటూ సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. కరోనా కట్టడికి సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటే అనసూయకు సడలింపులు కావాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు సంపాదించే ఆమె పరిస్థితే అలా ఉంటే ఏరోజుకారోజు కూటికి సంపాందించుకునే పేదల పరిస్థితి ఏంటీ? అంటూ ప్రశ్నిస్తున్నారు. 

Also Read |  Queen Elizabeth IIకు కరోనా.. ప్యాలెస్ నుంచి బయటకే