హైదరాబాద్ లో మరో కరోనా పాజిటివ్ కేసు ?

హైదరాబాద్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కోరనా పాజిటివ్ రావటంతో అతని బ్లడ్ శ్యాంపిల్స్ మరోసారి పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఇప్పటివరకు 3 పాజిటివ్ కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి.
స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వ్యాధి లక్షణాలు ఉండటంతో అతడ్ని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సోమవారం గాంధీ ఆస్పత్రిలో ఆవ్యక్తికి చేసిన రక్త పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది.
కాగా…. రోగ నిర్ధారణ కోసం అతని రక్త నమూనాలను మరోసారి నిర్ధారణ కోరకు పూణే ల్యాబ్ కు పంపించారు. అక్కడి పరీక్షల్లోనూ అతనికి పాజిటివ్ వస్తే అప్పుడు అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Also Read | కరోనా మాస్క్‌ల తయారీలో కేరళ ఖైదీల రికార్డు