సీఎల్పీ కిరీటం : భట్టి జీవిత విశేషాలు

ఖమ్మం : సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ హై కమాండ్ ఎంపిక చేసింది. తాము ఎంపిక చేయలేం..మీరే ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలంటూ తీర్మానం చేసిన ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతిలో పెట్టారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తరుణంలో మరి లేటు చేస్తే బాగుండదని అనుకున్న హై కమాండ్ జనవరి 18వ తేదీ రాత్రి నిర్ణయం తీసుకుంది. సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను ఎంపిక చేస్తున్నట్లు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇక మల్లు జీవిత విశేషాల విషయానికి వస్తే…
మల్లు భట్టి విక్రమార్క 1961లో ఖమ్మం జిల్లాలో జన్మించారు. నిజాం కాలేజీలో విద్యను అభ్యసించారు. ఐఏఎస్ అధికారి కావాలనుకున్న భట్టి విక్రమార్క ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్లారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పని చేసిన ఆయన.. 1996 నుంచి 2000 వరకు ఆంధ్రాభ్యాంక్ డైరెక్టర్‌గా నామినేటెడ్ పదవి పొందారు. 2000-03 వరకు పీసీసీ కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత 2007-2009 వరకు ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014, 18 ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే విజయం సాధించారు. 2009లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2014లో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 2015లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.
సీఎల్పీ నేతగా అవకాశమిచ్చినందుకు రాహుల్‌కు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. అసెంబ్లీ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాట చేస్తానని స్పష్టం చేశారు.