కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడి ఎఫెక్ట్ : ఏసీపీపై వేటు
ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా కాంగ్రెస్ నిర్వహించిన ప్రగతి భవన్ ఎఫెక్ట్ పోలీసులపై పడింది. ఆ సమయంలో ప్రగతి భవన్ దగ్గర విధులు నిర్వహిస్తున్న ఆసిఫ్‌నగర్ ఏసీపీ నంద్యాల

ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా కాంగ్రెస్ నిర్వహించిన ప్రగతి భవన్ ఎఫెక్ట్ పోలీసులపై పడింది. ఆ సమయంలో ప్రగతి భవన్ దగ్గర విధులు నిర్వహిస్తున్న ఆసిఫ్‌నగర్ ఏసీపీ నంద్యాల
ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా కాంగ్రెస్ నిర్వహించిన ప్రగతి భవన్ ఎఫెక్ట్ పోలీసులపై పడింది. ఆ సమయంలో ప్రగతి భవన్ దగ్గర విధులు నిర్వహిస్తున్న ఆసిఫ్‌నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై వేటు పడింది. నరసింహారెడ్డిని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు… కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. విధులు నిర్వహిస్తున్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో.. రేవంత్‌రెడ్డిపై కేసు నమోదైంది. రేవంత్ పై ఐపీసీ సెక్షన్ 341, 332, 353 కింద నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2019, అక్టోబర్ 21న ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 48లో ఉన్న రేవంత్ నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా కట్టడి చేశారు.
కానీ..మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేవంత్, తన అనుచరులతో కలిసి బయటకు వేగంగా దూసుకొచ్చారు. అప్పటికే అక్కడున్న బైక్‌పై ప్రగతి భవన్ వైపు వెళ్లారు. ఈ సమయంలో ఎస్ఐ నవీన్ రెడ్డి, పలువురు పోలీసులు రేవంత్‌ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. వారిని పక్కకు తోసేస్తూ..వెళ్లారు రేవంత్. ఈ నేపథ్యంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన రేవంత్ రెడ్డిపై ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.