స్కూళ్లు, హాళ్లు అన్నీ బంద్.. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు

  • Published By: madhu ,Published On : March 14, 2020 / 04:20 PM IST
స్కూళ్లు, హాళ్లు అన్నీ బంద్.. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు

Updated On : March 14, 2020 / 4:20 PM IST

కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. హై లెవల్ మీటింగ్ అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను స్వయంగా సీఎం కేసీఆర్ శనివారం(మార్చి 14,2020) మీడియాకు వివరించారు. 

ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, జనాలు ఎక్కువగా ఉన్న చోట వెళ్ల వద్దని సూచించారు. పొరుగు రాష్ట్రాలు కొన్ని స్టెప్స్ తీసుకున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ కూడా చర్యలు తీసుకుంటోందన్నారు.

కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు : – 
1. ‘ఏ రకమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి సంపూర్ణంగా సన్నద్ధంగా ఉందని, రూ. 500 కోట్లు ఖర్చు చేసింది. సీఎస్ 
2. హెల్త్ డిపార్ట్ మెంట్ సర్వ సిద్ధంగా ఉంది.  ఎయిర్ పోర్టులో 200 మంది స్ర్కీనింగ్ చేస్తున్నారు. 
3. రాష్ట్ర వ్యాప్తంగా 1020 బెడ్స్ రెడీగా ఉన్నాయి. 321 ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ కూడా ఉన్నాయి. 

4. 240 వెంటిలేటర్స్ ఉన్నాయి. రాష్ట్రంలో క్వారెంటైన్ చేయడానికి…నాలుగు ఏర్పాటు చేయడం జరిగింది. 
5. వైద్య ఆరోగ్య శాఖ (మంత్రి, సీఎస్), తదితర శాఖలు, డిపార్ట్ మెంట్ అధికారుల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. 
6. రెండు దశల కార్యక్రమం. 15 రోజులు, వీక్ డేస్ కార్యక్రమం. మార్చి 31 వరకు విద్యా సంస్థలు బంద్ చేయబడుతాయి. 
7. బోర్డు పరీక్షలు యదాతథంగా జరుగుతాయి. 

8. ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో..రెసిడెన్షియల్ స్కూళ్లలో నిరుపేద విద్యార్థులకు హాస్టల్ వసతి కొనసాగుతుంది. ప్రత్యేక శానిటరీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ. 
9. మ్యారేజెస్ హాల్స్ మూసివేత. ఇప్పటికే ఖరారైన పెళ్లిళ్లు చేసుకోవచ్చు (200 మంది మాత్రమే). మార్చి 31 తర్వాత హాల్స్ బుక్ చేయవద్దు. 
10. పబ్లిక్ మీటింగ్స్, సెమినార్లు, ఉత్సవాలు, ర్యాలీలు, ఎగ్జీబీషన్లు..ఇతరత్రా వాటికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడవు. 

11. ఇండోర్, స్విమ్మింగ్ ఫూల్స్, ఔట్ డోర్ స్టేడియాలు మూసివేయాలి. 
12. అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు.
13.  ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు యదాతథంగా నడుస్తాయి. 
14. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి ప్రజలు అసౌకర్యంగా సూపర్ మార్కెట్లు, ఇతర దుకాణాలు బంద్ చేయడం లేదు’. అని సీఎం కేసీఆర్ తెలిపారు. 
Read More : కరోనా వస్తుంది ఇలా : ముందు జ్వరం..పొడిదగ్గు.. తర్వాత