కరోనా కాటేస్తోంది : టెస్ట్ శాంపిల్స్‌కు తెలంగాణలో ల్యాబులెక్కడ?!

  • Published By: sreehari ,Published On : January 28, 2020 / 08:44 AM IST
కరోనా కాటేస్తోంది : టెస్ట్ శాంపిల్స్‌కు తెలంగాణలో ల్యాబులెక్కడ?!

Updated On : January 28, 2020 / 8:44 AM IST

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ప్రాణభయంతో హడలిపోతున్నాయి. ప్రాణాంతకమైన నోవెల్ కరోనా వైరస్ (2019-nCoV) పలు దేశాల్లోకి పాకింది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి మొదలైన వైరస్ వ్యాప్తి.. ప్రపంచ దేశాలకు పాకింది. ఇండియాలోకి కూడా ఈ వైరస్ వ్యాపించినట్టు వార్తలు వస్తున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు కొంతమంది బాధితులను గుర్తించారు. వారికి ప్రత్యేకమైన వైద్య సౌకర్యాలను అందించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఒకరిద్దరికి కూడా ఈ వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వైరస్ పరీక్షలకు పరికారాలున్నాయా?
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో కరోనా వైరస్ పరీక్షల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయనట్టుగా కనిపిస్తోంది. కనీసం టెస్టు శాంపిల్స్ టెస్టింగ్ చేసేందుకు ల్యాబుల్లో పరికరాలు కూడా అందుబాటులో లేవని తెలిసింది. ఏడాదిన్నర క్రితం నిఫా వైరస్ రాష్ట్రాన్ని వణికించింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఇన్సిస్టట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్ (IPM)ను అప్ గ్రేడ్ చేయడం జరిగింది. అందులో అప్పటికే ఏర్పాటైన బయో సేఫ్టీ లెవల్ 2 (BSL 2) నుంచి  అప్ గ్రేడ్ చేసి బయోసేప్టీ లెవల్ 3 (BSL-3)గా మార్చేశారు. దాదాపు 18 నెలల తర్వాత ఈ ప్లాన్‌కు బ్రేక్ పడింది.

ప్రస్తుత సౌకర్యాలున్న ఈ స్థాయి ల్యాబరేటరీల్లో అంటువ్యాధులు, ప్రాణాంతక వైరస్ లైన నిఫా వైరస్, ఎబోలా వైరస్, జికా, కరోనా వైరస్ లపై టెస్టింగ్ చేసేందుకు అనుమతించే స్థాయి లేదని సమాచారం. ప్రస్తుతం.. పుణెలో ఉన్న నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)లో మాత్రమే ఈ తరహా వైరస్ లపై టెస్టింగ్ చేసే పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
Read Also : సైంటిస్టులు కనిపెట్టేశారు: #Coronavirus వెనుక షాకింగ్ రీజన్స్!

ప్రాణాంతకమైన వైరస్ ల వ్యాప్తిని అడ్డుకునేలా బయో సేఫ్టీ ల్యాబులు అత్యంత సురక్షితమైన స్థాయిలో ఉండాల్సి ఉంది. లేదంటే.. ఈ ల్యాబరేటిరీల్లో వైరస్ లపై టెస్టింగ్ సమయంలో బయటకు విడుదలయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుత BSL 3 బయో సేఫ్టీలోని గది, దాని పైకప్పు పైబర్‌తో కప్పబడి ఉంది. అందులోని ఉష్ణోగ్రతను ఆధునాతన ల్యాబరేటరీ పరికరాలతో కంట్రోల్ చేస్తోంది. అన్ని ల్యాబ్ మెటేరియల్స్ తో రెగ్యులర్ గా అత్యధికంగా ఈ గదిని ఫిల్టర్ చేస్తుంటారు. ఈ BSL 3 ల్యాబులోని క్లీనింగ్ ఏరియాలోకి ఎవరైనా సరే వెళ్లిన ప్రతిసారి తప్పనిసరిగా కొన్ని నిబంధనలకు అనుగుణంగా మాత్రమే అనుమతించడం జరుగుతుంది. 

2018లోనే ల్యాబ్ అప్ గ్రేడ్ కు ఆమోదం :
జూన్ 2018లోనే ఈ ల్యాబ్ అప్ గ్రేడ్ చేయాలని ప్లాన్ కు ఆమోదం లభించింది. ఈ ల్యాబ్ అప్ గ్రేడ్ చేయడానికి రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ల్యాబులోని సౌకర్యాల గురించి IPM డైరెక్టర్ కే. శంకర్ ను మీడియా అడగిన ప్రశ్నకు ఆయన ప్రస్తుతం అప్ గ్రేడ్ వర్క్ కొనసాగుతోందని చెప్పారు.

దీనిపై నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న ల్యాబ్ లో కరోనా వైరస్ సహా ఇతర వైరస్ లపై టెస్టింగ్ చేసేందుకు పరికరాలు కూడా ఉన్నాయని అన్నారు. కరోనా వైరస్, నిఫా వైరస్ లకు సంబంధించి టెస్టులు చేయడానికి కనిష్టంగా BSL 3 స్థాయి ల్యాబరేటరీ ఒకటి సరిపోతుందని ఆయన చెప్పారు. 

వసతులపై కేంద్ర వైద్య బృందం అసంతృప్తి :
మరోవైపు, కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఫీవర్ ఆస్పత్రి వైద్యులపై కేంద్ర వైద్య బృందం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డుల్లో సరైన వసతులు లేవని బృందం తెలిపింది. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తోన్న వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించింది. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో, శంషాబాద్ ఎయిర్ పోర్టుల్లో స్ర్కీనింగ్ సెంటర్లను కూడా కేంద్ర వైద్య బృందం పరిశీలించనుంది. 
Read Also : #Coronavirus మందు కనిపెట్టా : ఇదే మెడిసిన్ అంటున్న తమిళ వైద్యుడు!