ఏం జరగనుంది : ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు విధించిన డైడ్ లైన్ ముగిసింది. ఆర్టీసీ జేఏసీతో చర్చలపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వం తీరు చూస్తుంటే

  • Published By: veegamteam ,Published On : October 19, 2019 / 08:13 AM IST
ఏం జరగనుంది : ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది

Updated On : October 19, 2019 / 8:13 AM IST

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు విధించిన డైడ్ లైన్ ముగిసింది. ఆర్టీసీ జేఏసీతో చర్చలపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వం తీరు చూస్తుంటే

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు విధించిన డైడ్ లైన్ ముగిసింది. ఆర్టీసీ జేఏసీతో చర్చలపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వం తీరు చూస్తుంటే వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు అర్థమవుతోంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ యూనియన్లతో చర్చలు జరపాల్సిందేనని కేసీఆర్ సర్కార్ కి హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. శనివారం(అక్టోబర్ 19,2019) ఉదయం 10.30 గంటలకు చర్చలు జరపాలని ఆదేశాలు ఇచ్చింది. మూడు రోజుల్లో ఆర్టీసీ కార్మికులతో చర్చలు పూర్తి చేయాలంది.

హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. చర్చలు జరపాలంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా తమకు అందలేదని రవాణశాఖ వర్గాలు తెలిపాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ సమ్మె చర్చలపై సీఎం కేసీఆర్ సమీక్ష జరపనున్నారు. ఆర్టీసీ సమ్మె చర్చలపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.

ఆర్టీసీ విలీనంతోపాటు 26 డిమాండ్లను కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచగా… అందులో ఆర్థిక పరమైన అంశాల డిమాండ్లు మినహా అన్ని డిమాండ్లకు ఓకే చెప్పాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కార్మిక సంఘాలు పెట్టిన డిమాండ్లలో అత్యధిక శాతం ఆర్థిక వ్యవహారాలతో ముడిపడినవే. దీంతో దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటోంది సర్కార్.