కరోనా నెగెటివ్ కు బదులు పాజిటివ్ రిపోర్టు.. గాంధీ ఆస్పత్రి వైరాలజీ హెచ్ వోడీపై బదిలీ వేటు
విధుల్లో అలసత్వం వహించిన గాంధీ ఆస్పత్రి వైరాలజీ హెచ్ వోడీపై ప్రభుత్వం సీరియస్ అయింది. కరోనా వైరస్ నెగెటివ్ కు బదులు పాజిటివ్ రిపోర్టు ఇచ్చిన అధికారినిపై బదిలీ వేటు వేసింది.

విధుల్లో అలసత్వం వహించిన గాంధీ ఆస్పత్రి వైరాలజీ హెచ్ వోడీపై ప్రభుత్వం సీరియస్ అయింది. కరోనా వైరస్ నెగెటివ్ కు బదులు పాజిటివ్ రిపోర్టు ఇచ్చిన అధికారినిపై బదిలీ వేటు వేసింది.
విధుల్లో అలసత్వం వహించిన గాంధీ ఆస్పత్రి వైరాలజీ హెచ్ వోడీపై ప్రభుత్వం సీరియస్ అయింది. కరోనా వైరస్ నెగెటివ్ కు బదులు పాజిటివ్ రిపోర్టు ఇచ్చిన అధికారినిపై బదిలీ వేటు వేసింది. ఫీవర్ ఆస్పత్రికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా టెస్టుల విషయంలో నిర్లక్ష్యం వల్లే హెచ్ వోడీని బదిలీ చేసినట్లు సమాచారం.
కరోనా వైరస్ కు సంబంధించి దేశవ్యాప్తంగా కొన్ని వైరాలజీ సెంటర్లను ఏర్పాటు చేసింది. వైరాలజీ డిపార్టుమెంట్లలో మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అయితే గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైరాలజీ డిపార్ట్ మెంట్ హెచ్ వోడీగా ప్రొ.నాగమణి కొనసాగుతున్నారు. గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గా కూడా ఉన్నారు. నాగమణి కొంతకాలంగా వైరాలజీ డిపార్ట్ మెంట్ లో కరోనా పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను చూస్తున్నారు. అయితే కొంతకాలంగా కరోనా పరీక్ష చేయడంలో అలసత్వం వహించడం, ల్యాబ్ మెయింటనెన్స్ సరిగ్గా చేయడం లేదనే వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా రెండు రోజుల క్రితం తెలంగాణలో తొలిసారి నమోదైన కేసుకు సంబంధించి కాంటాక్టు, మొదటగా వచ్చిన బంధువు నుంచి, ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి.. ఈ రెండు కేసులకు సంబంధించి పాజిటివ్ వచ్చింది..అది కొంత అనుమానంగా ఉందన్న ఉద్దేశ్యంతో మళ్లీ పూణె వైరాలజీ డిపార్ట్ మెంట్ కు పంపించాల్సిందిగా చెప్పారు. అయితే ఇక్కడ పాజిటివ్ వచ్చిన కేసు..అక్కడ నెగెటివ్ రావడంతో దీనిపై వెంటనే యాక్షన్ తీసుకున్నట్లు సమాచారం.
ఇవాళ సాయంత్రం ప్రకటించిన దాంట్లో నెగెటివ్ వచ్చినట్లు అర్థమవుతోంది. విధుల్లో అలసత్వం వహించింది..మరోవైపు డిపార్ట్ మెంట్ లో కూడా ల్యాబ్స్ చాలా ఉన్నాయి…వాటిని ఫుల్ పిల్ చేయడానికి బాధ్యతాయుతంగా పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించామని మంత్రి చెప్పడం గమనార్హం.