హైదరాబాద్ శివారులో కలకలం: మహిళ అస్థిపంజరం గుర్తింపు

గుర్తు తెలియని మృతదేహాల గురించి వింటుంటాం కదా? అయితే ఎంతోకాలం గుర్తంచకపోతే ఆ మృతదేహాలు అస్థిపంజరాలుగా మారిపోతుంటాయి. అయితే లేటెస్ట్‌గా హైదరాబాద్ శివారులో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మహిళ అస్థిపంజరం బయటపడింది.
మేడ్చల్ జిల్లా మల్లంపేట-బొల్లారం సరిహద్దు ఔటర్ రింగ్ రోడ్‌కి సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో డ్రైనేజీలో ఓ మహిళ అస్థిపంజరంను గుర్తించారు స్థానికులు.
దుండిగల్ పోలీసులు అక్కడికి చేరుకొని అస్థిపంజరాన్ని పరిశీలించారు. నెలరోజుల క్రితమే మహిళ చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
చనిపోయిన మహిళ వయస్సు అస్థి పంజారాన్ని బట్టి చూస్తే మహిళ వయస్సు 40 నుంచి 50 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు.