ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వస్తాయి: మంత్రి హరీష్ రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అంశం తెలంగాణకు కలిసి వస్తుందని అన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో రాజధానిపై స్పష్టమైన క్లారిటీ లేకపోవడం.. ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వస్తాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉందని అన్నారు. బ్యూరోక్రాట్లు.. వ్యాపార వేత్తలు హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
క్రెడాయ్ తెలంగాణ సమావేశంలో మాట్లాడిన మంత్రి హరీష్ తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలోని పెద్ద బిల్డర్లు సామాజిక బాధ్యతగా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఐటీ ఉద్యోగులతో పాటు బ్యూరోక్రాట్లు, వ్యాపార వేత్తలు హైదరాబాద్‌లో స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తిగా చూపుతున్నారని అన్నారు. చెన్నైలో మంచినీటి సమస్య, బెంగళూరులో ట్రాఫిక్, ఢిల్లీలో కాలుష్యం, ముంబైలో అధిక ధరలు ఉంటే హైదరాబాద్‌లో అటువంటి సమస్యలు లేకపోవడం తెలంగాణకు కలిసివచ్చే విషయం అని అన్నారు హరీష్ రావు.