బీ అలర్ట్ : మరో మూడు రోజులు వడగాలులు

  • Published By: madhu ,Published On : May 9, 2019 / 01:49 AM IST
బీ అలర్ట్ : మరో మూడు రోజులు వడగాలులు

Updated On : May 9, 2019 / 1:49 AM IST

తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భగభగలాడుతున్న ఎండలతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అత్యాధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. దీనితో పాటు వడగాలులు వీస్తుండడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

42 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం లేదని అధికారులు తెలియచేస్తున్నారు. మే 08వ తేదీ బుధవారం నల్గొండ, ఖమ్మం జిలాల్లో 45 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యింది. ఉత్తర ఇంటీరియర్ ఒడిశా నుంచి రాయలసీమ వరకు ఛత్తీస్ గడ్, తెలంగాణ మీదుగా ఉపరితల ధ్రోణి కొనసాగుతోంది. 

ప్రాంతం ఉష్ణోగ్రత
హైదరాబాద్ 42.1
నల్లగొండ 45.0
ఖమ్మం 44.8
ఆదిలాబాద్ 44.3
నిజామాబాద్ 43.8
రామగుండం 44.0
మహబూబ్ నగర్ 43.5
హన్మకొండ 42.0
మెదక్ 42.6