బస్సులో రూ.24లక్షలు : మహిళా మంత్రి అనుచరుడి నుంచి సీజ్
హైదరాబాద్ : ఎన్నికల వేళ హైదరాబాద్ లో నోట్ల కట్టల కలకలం చెలరేగింది.

హైదరాబాద్ : ఎన్నికల వేళ హైదరాబాద్ లో నోట్ల కట్టల కలకలం చెలరేగింది.
హైదరాబాద్ : ఎన్నికల వేళ హైదరాబాద్ లో నోట్ల కట్టల కలకలం చెలరేగింది. ఆరాంఘర్ ప్రాంతంలో పోలీసులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేస్తుండగా సంతోష్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర రూ.24 లక్షలను పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు డబ్బుని స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత ముఖ్య అనుచరుడు, రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ డబ్బును రాప్తాడులో పంచడానికి తెలుగుదేశం పార్టీ నేతలు తరలిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also : మోడీకి సిగ్గు..లజ్జ లేదు.. అసమర్థుడు – బాబు ఘాటు వ్యాఖ్యలు
రాప్తాడులో పరిటాల శ్రీరామ్ ను గెలిపించేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచుతూ టీడీపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారసుడి కోసం పరిటాల సునీత త్యాగం చేశారు. తాను పోటీ చేయకుండా కొడుకు శ్రీరామ్ ని బరిలోకి దింపారు. శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
Read Also : క్రీడామంత్రిపై క్రీడాకారిణిని పోటీకి దించిన కాంగ్రెస్