బిగ్ ఛేంజ్ : హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో వర్షం

కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ - వాన ఉంది. కొన్ని చోట్ల గాలులు ఉన్నాయి. ఏప్రిల్ 20వ తేదీ నుంచి నాలుగు రోజులు వాతావరణంలో మార్పులు

బిగ్ ఛేంజ్ : హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో వర్షం

కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ – వాన ఉంది. కొన్ని చోట్ల గాలులు ఉన్నాయి. ఏప్రిల్ 20వ తేదీ నుంచి నాలుగు రోజులు వాతావరణంలో మార్పులు

ఏం ఎండ బాబూ.. వీకెండ్ అయినా కాలు బయటపెట్టలేకపోతున్నాం.. ఏప్రిల్ 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వరకు హైదరాబాద్ లోని సిట్యువేషన్ ఇది. ఆ తర్వాత నిమిషాల్లో వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతం అయ్యింది. ఉరుములు, మెరుపులు. సిటీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఒక్కసారిగా మారిపోయిన వెదర్ తో అవాక్కయ్యారు జనం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో వర్షం పడుతుంది.

క్రమంగా సిటీ అంతా వెదర్ మారిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ – వాన ఉంది. కొన్ని చోట్ల గాలులు ఉన్నాయి. ఏప్రిల్ 20వ తేదీ నుంచి నాలుగు రోజులు వాతావరణంలో మార్పులు ఉండొచ్చని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు నిజం అయ్యాయి. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉండటంతో చెట్ల కిందకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.