Weather UPdate : నగరంలో వర్షం పడే ఛాన్స్

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. హిందూ మహాసముద్రంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ఫలితంగా మార్చి 1 శుక్రవారం, మార్చి 2 శనివారాల్లో నగరంలో వర్షం పడే ఛాన్స్‌లున్నాయని తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 27వ తేద బుధవారం 33 డిగ్రీలు నమోదైంది.