ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత…నేడే నామినేషన్!

ఎంపీగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కేసిఆర్ కూతురు కవిత.. రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కవిత నామినేషన్ వెయ్యబోతున్నారు. ఇవాళ(18 మార్చి 2020) ఉతయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కవితను రాజ్యసభకు పంపిస్తారని మొన్నటిదాకా.. వార్తలు వచ్చినప్పటికీ, రాజ్యసభకు కేకే, సురేష్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ పంపించగా.. ఇప్పడు ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు కేసిఆర్. రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుండగా.. కవిత మళ్లీ రాజకీయాల్లోకి రిఎంట్రీ ఇవ్వనుంది. అయితే కవితకు మంత్రి పదవి ఇవ్వడానికి సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొందరు అనుకుంటున్నారు.
Also Read | ఏపీలో కరోనా కట్టడికి కమిటీ..12 రైళ్లు రద్దు
మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ మారడం.. ఆయనపై అనర్హత వేటు పడడంతో నిజామాబాద్ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అధికారపార్టీ నుంచి ఎవరికి ఈ అవకాశం దక్కుతుందా? అని కొంతకాలంగా ఆసక్తికర చర్చ సాగింది. మండవ వెంకటేశ్వరరావు, నర్సిరెడ్డితోపాటు కవిత పేర్లను పరిశీలించి చివరకు కవితకు అవకాశం ఇచ్చారు కేసిఆర్. దీంతో నిజామాబాద్ స్ధానిక సంస్ధల టీఆర్ఎస్ అభ్యర్ధినిగా కవిత ఖరారయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారు. ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె దూరంగా ఉంటున్నారు.