స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న ముఖ్యమంత్రి

  • Published By: vamsi ,Published On : April 27, 2019 / 10:52 AM IST
స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న ముఖ్యమంత్రి

Updated On : April 27, 2019 / 10:52 AM IST

విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి వారి ఆశిస్సులను తీసుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన కేసిఆర్.. ఫిల్మ్ నగర్‌ దైవ సన్నిధానానికి స్వరూపానంద వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆధ్యాత్మిక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సంధర్భంగా జూన్‌లో శారద పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి రావాలని కేసీఆర్‌ని స్వరూపానంద ఆహ్వానించారు. జూన్ 15 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో ఉత్తరాధికారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.