హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి కేటీఆర్ షెడ్యూల్ ఖరారు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి కేటీఆర్ షెడ్యూల్ ఖరారు అయింది. మండలాల వారీగా టీఆర్ఎస్ ప్రచార సభలు ఏర్పాటు చేయనున్నారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి కేటీఆర్ షెడ్యూల్ ఖరారు అయింది. మండలాల వారీగా టీఆర్ఎస్ ప్రచార సభలు ఏర్పాటు చేయనున్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి కేటీఆర్ షెడ్యూల్ ఖరారు అయింది. మండలాల వారీగా టీఆర్ఎస్ ప్రచార సభలు ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 10న మేళ్ల చెరువు, 11న జాన్ పహాడ్, నేరేడుచర్ల, 12న మఠంపల్లి, 13న గరిడేపల్లిలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే కేటీఆర్ హుజూర్ నగర్ లో రోడ్ షో నిర్వహించారు.
హుజూర్ నగర్ ఉపఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఉపఎన్నిక పరిణామాలు కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి. మొత్తం 76 మంది నామినేషన్ వేయగా అందులో 45 మంది అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 31 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అనంతరం మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించున్నారు. చివరకు 28 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆటో, ట్రక్కు గుర్తులను డిలిట్ చేస్తూ నోటీసు బోర్డులో ఉంచారు. మొత్తం 70 నుంచి 80 గుర్తులను డిస్ ప్లే చేశారు. 13 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉండగా, మిగిలిన 15 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.
సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది, టీజేఎస్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. టీడీపీ, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఇక సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో ఉప ఎన్నికల్లో కామ్రేడ్లు పోటీకి దూరమయ్యారు.