మాదాపూర్‌లో రోడ్డు ప్రమాదం, నిఫ్ట్ విద్యార్థిని మృతి

జూబ్లీ హిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన మరువకముందే.. మరో విద్యార్థిని రోడ్ యాక్సిడెంట్‌లో ఆ పక్కనే ఉన్న మాదాపూర్‌లో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
స్నేహితుడితో కలిసి కాలేజికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. మహారాష్ట్ర స్వస్థలమైన మిథాలీ శర్మ (20) హైదరాబాద్ లోని కాలేజిలో చదువుకుంటుంది.
తన స్నేహితుడితో కలిసి కాలేజీకి హోండా సిటీ బైక్ పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయానికి గురైంది.
స్నేహితుడు రిక్టీంతో పాటుగా మిథాలీని వెంటనే హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూనే ఆమె మృతి చెందింది.