ఇలా ఉంది : ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై అఫిడవిట్

ఆర్టీసీ స్థితిగతులపై యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.644.451 కోట్లు విడుదల చేసినట్లు యాజమాన్యం తెలిపింది.

  • Published By: veegamteam ,Published On : November 1, 2019 / 10:00 AM IST
ఇలా ఉంది : ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై అఫిడవిట్

Updated On : November 1, 2019 / 10:00 AM IST

ఆర్టీసీ స్థితిగతులపై యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.644.451 కోట్లు విడుదల చేసినట్లు యాజమాన్యం తెలిపింది.

ఆర్టీసీ స్థితిగతులపై యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.644  కోట్లు విడుదల చేసినట్లు యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్ లో బస్సులు నడుపుతున్నందుకు ఆర్టీసీకి జీహెచ్ఎంసీ రూ.1786.06 కోట్లు చెల్లించాల్సివుండగా 2015-17 మధ్య కాలంలో రూ.336 కోట్లు చెల్లించిందని, మిగతా సొమ్ము చెల్లించే స్థోమత లేదని జీహెచ్ ఎంసీ చెప్పినట్లు యాజమాన్యం తెలిపింది.

ఆర్టీసీ నిర్వహణ, డీజిల్ భారం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. సమ్మె మొదలైనప్పటి నుంచి 30 వ తేదీ వరకు ఆర్టీసీకి రూ.82 కోట్ల నష్ట వచ్చిందని తెలిపింది. నష్టాలను భరించే స్థితిలో లేమని వెల్లడించింది.  

ఆర్టీసీ యాజమాన్యం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, ఆర్టీసీ యాజమాన్యం, కార్మికులు చెబుతున్న లెక్కలకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ యాజమాన్యం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ పై వాదనాలు కొనసాగుతున్నాయి.