టీఆర్ఎస్ కంటే ముందు చాలా పార్టీలు చూశాం : భట్టి విక్రమార్క

  • Published By: chvmurthy ,Published On : February 23, 2019 / 11:58 AM IST
టీఆర్ఎస్ కంటే ముందు చాలా పార్టీలు చూశాం : భట్టి విక్రమార్క

Updated On : February 23, 2019 / 11:58 AM IST

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే  పొరపాటని,  టీఆర్ఎస్ కంటే ముందు చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన వ్యాఖ్యానిస్తూ ఎమ్మెల్సీ గెలవడం అన్నది కాంగ్రెస్ బాధ్యత అని, ఒక్క ఎమ్మెల్సీ గెలిచే సంఖ్యా బలం మాకుంది , టీఆరెస్ కు ఐదుగురిని గెలిపించుకునే సంఖ్యాబలం లేదని ఆయన  చెప్పారు.
Read Also: అసెంబ్లీలో కేసీఆర్: ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు

ఐదుగురు ఎమ్మెల్సీలు గెలిచే సంఖ్యాబలం టీఆర్ఎస్ కు  ఎక్కడ ఉందో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని  భట్టి సూచించారు. కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని, టీఆరెస్ పార్టీ కి ఓటు వేస్తే  మోడీ అవుతారా లేక….ఎవరు  ప్రధాన మంత్రి అవుతారో టీఆర్ఎస్ పార్టీ చెప్పాలి అని  భట్టి  డిమాండ్ చేశారు. 
Read Also: కాంగ్రెస్ గో బ్యాక్: బస్సు యాత్రను అడ్డుకున్న వైసీపీ