రంజాన్ పర్వదినం : శోభాయమానంగా మసీదులు 

  • Published By: veegamteam ,Published On : May 3, 2019 / 05:12 AM IST
రంజాన్ పర్వదినం : శోభాయమానంగా మసీదులు 

Updated On : May 3, 2019 / 5:12 AM IST

రంజాన్‌ మాసం. ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల. ప్రతీ ముస్లిం నియమ నిష్టలతో ఉపవాసాలు చేస్తు భక్తి ప్రపత్తులతో అల్లాను సేవించుకునే పవిత్రమైన మాసం రంజాన్ మాసం. మే 5న ప్రారంభం కానున్న రంజాన్ మాసానికి నగరంలోని మసీదులను సర్వాంగ సుందరంగా తీర్చిదిదద్దుతున్నారు ముస్లిం సోదరులు. 

రంజాన్ మాసం అంతా ప్రార్థనలు నిర్వ హించుకోవడానికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మహ్మద్‌ ఖాసీం గురువారం (మే2)పనులను పరిశీలించారు.  చార్మినార్ సమీపంలో ఉన్న చారిత్రాత్మక మక్కా మసీదు, పబ్లిక్‌గార్డెన్స్‌ వద్ద రాయల్‌ మసీదులకు  రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. 

400 ఏళ్ల చరిత్ర ఉన్న  మక్కామసీదు, 100 ఏళ్ల చరిత్ర ఉన్న  రాయల్‌మసీదుల నిర్వహణలను ఆనాటి పాలకుడు నిజాం ప్రభుత్వానికి అప్పగించాడు. ఆనాటినుంచి ప్రభుత్వమే వీటికి నిధులను కేటాయిస్తోంది. ఈ క్రమంలో 2018-19లకు గాను రూ. 3.19 కోట్లు,2019-20 సంవత్సరానికి  1.75 కోట్లను ప్రభుత్వం నిధులను విడుదల  చేసింది. దీంట్లో రూ. 1.48 కోట్లను రెండు మసీదుల నిర్వహణ కోసం వెచ్చించనుండగా, రూ. 39 లక్షలను కేవలం రంజాన్‌ మాసం ఖర్చుల కోసం కేటాయించింది.