వణికిస్తున్న కరోనా: మైండ్ స్పేస్ ఖాళీ

హైదరాబాద్‌లో ఓ 24ఏళ్ల టెకీకి కరోనా వైరస్ సోకడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే రహేజా మైండ్ స్పేస్ ఖాళీ అయిపోయింది. ఉద్యోగులు రాకపోవడం… కంపెనీలు ఇంటి వద్ద నుంచే ఉద్యోగులను పని చేయ్యమని సూచనలు చెయ్యడంతో ఎప్పుడూ టెక్కీలతో సందడిగా ఉండే మైండ్ స్పేస్ ఖాళీ అయిపోయింది.
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే అనుమానితుల సంఖ్య పెరిగిపోయింది. గాంధీ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. ఇప్పటివరకు ఒక్కరికి మాత్రమే పోసిటివ్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మైండ్ స్పేస్ లోని బిల్డింగ్ నంబర్ 20 లో ఉన్న డిఎస్‌ఎం కంపెనీలో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలిపోయింది.
దాంతో ఇప్పటివరకు అందులో ఉన్న ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు. 9వ ఫ్లోర్‌లో వున్న ఈ కంపనీలో ఉద్యోగులంతా విధులకు హాజరుకావట్లేదు. మరోవైపు తెలంగాణాలో ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. (కరోనా ఎఫెక్ట్..మాస్క్ పెట్టుకుని పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ )