హైదరాబాద్ ఫార్మా సిటీకి ఆర్థిక సాయం అందించాలి
హైదరాబాద్ ఫార్మా సిటీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం (అక్టోబర్ 20, 2019) కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ కు ఆయన లేఖ రాశారు.

హైదరాబాద్ ఫార్మా సిటీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం (అక్టోబర్ 20, 2019) కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ కు ఆయన లేఖ రాశారు. నిమ్జ్ హోదాకు సూత్రప్రాయ అంగీకారం తెలిపిన క్రమంలో కేంద్రాన్ని మంత్రి ఆర్థిక సహాయం కోరారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతి పెద్ద సమీకృత ఫార్మా పార్క్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ మేకిన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఫార్మాసిటీ దేశీయ ఫార్మా రంగాన్ని బలోపేతం చేస్తోందన్నారు. ఫార్మాసీటి ద్వారా సుమారు రూ.64 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. సుమారు 5 లక్షల 60 వేల మందికి ఉపాధి కలుగనుందన్నారు. ఫార్మాసిటీ మౌలిక వసతుల కోసం రూ.1318 కోట్లు, సాంకేతిక సదుపాయాల కల్పనకు రూ.2100 కోట్లు ఇవ్వాలని లేఖలో కోరారు.