విన్నపాలు వినవలె : రాజ్ నాథ్ సింగ్‌తో కేటీఆర్ భేటీ

  • Published By: madhu ,Published On : October 30, 2019 / 10:24 AM IST
విన్నపాలు వినవలె : రాజ్ నాథ్ సింగ్‌తో కేటీఆర్ భేటీ

Updated On : October 30, 2019 / 10:24 AM IST

తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. 2019, అక్టోబర్ 30వ తేదీ బుధవారం సౌత్ బ్లాక్‌కు వెళ్లిన మంత్రి కేటీఆర్..రాజ్ నాథ్ సింగ్‌‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ – నాగ్ పూర్, హైదరాబాద్ – రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ఉన్న రహదారులు రవాణా అవసరాలకు సరిపోవడం లేదని దృష్టికి తీసుకొచ్చారు. ఆయా మార్గాల్లో స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున భూముల అప్పగింతపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. రక్షణ శాఖ ఇచ్చే భూములకు ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు మంత్రి కేటీఆర్. 
ఈ సందర్భంగా రాజ్ నాథ్‌తో జరిగిన సమావేశానికి సంబంధించిన ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. 
గతంలో కూడా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కోరిన సంగతి తెలిసిందే. కంటోన్మెంట్ రోడ్లను తెరిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నపాలు చేస్తున్నా స్పందించడం లేదని తెలిపారు. రక్షణ మంత్రిగా మీరు వెంటనే స్పందించి తెరిపించేలా చూడాలని కోరారు. గ్రీన్ సైనిక్ పురి కాలనీ వాసుల సంఘం కంప్లయింట్‌తో మంత్రి కేటీఆర్ ఈ విజ్ఞప్తి చేశారు. 
Read More :