ఇట్స్ సో బెటర్ : షోరూంలోనే వెహికల్ రిజిస్ట్రేషన్‌

ఇట్స్ సో బెటర్ : షోరూంలోనే వెహికల్ రిజిస్ట్రేషన్‌

Updated On : January 28, 2019 / 4:30 AM IST

తెలంగాణ ప్రభుత్వం రవాణాశాఖలోనూ కొత్త నియమాలను ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు ఇక నుంచి రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయం చుట్టూ తిరిగే పని తప్పినట్లే. ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఏజెంట్ల మోసాలు, అవినీతిని సాధ్యమైనంత వరకూ తగ్గించే వీలుంటుంది. వాహనాల రిజస్ట్రేషన్ ప్రక్రియను డీలర్లకే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు ఆదేశాలిచ్చింది. ఈ సదుపాయాన్ని ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తీసుకురానుంది. ముందుగా బైకులు, కార్లకు ఈ రూల్ తెస్తున్నారు. వీటిని అమ్మే షోరూంల దగ్గరే రిజిస్ట్రేషన్ తంతు పూర్తి అయిపోతుంది. 

డీలర్ల దగ్గరే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను అమర్చాలి. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ఫీజు అడ్డగోలుగా వసూలు చేసే అవకాశం లేదు. అందుకోసం నయా షరతులను అందుబాటులోకి తెచ్చారు. రూల్స్‌ను బేఖాతరు చేస్తే ఫైన్ వెయ్యడమే కాకుండా వారి డీలర్ షిప్‌ను సస్పెండ్ కూడా చేస్తారు. దీంతో ఏప్రిల్ నుంచీ రిజిస్ట్రేషన్ ప్లేట్ లేకుండా వాహనం రోడ్డెక్కే అవకాశమే ఉండదన్నమాట. 

ఇందులో మరో సడలింపు ఉంది. రిజిస్ట్రేషన్ నంబర్లలో ఫ్యాన్సీ నంబర్లు కావాలంటే మాత్రం తప్పనిసరిగా ఆర్టీఏ కార్యాలయం మెట్లు ఎక్కాల్సిందే.  ఆన్‌లైన్ సేవలలో కొత్త రూల్స్ తెచ్చేందుకు నయా సాఫ్ట్‌వేర్‌‍ను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం రూ.11 కోట్లు అవసరం అవుతాయని స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు అంచనా వేశారు. ఎన్నికల సమయమైనా నిధులు విడుదల చేసేందుకు వెనుకాడడం లేదు ప్రభుత్వం. ఏప్రిల్ నాటికి కొత్త నిబంధనలతో అంతా సిద్ధం చేస్తామని అధికారులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.