ఏడేళ్ల నుంచి పోరాడుతున్నా.. ఏడు రోజుల్లోనే న్యాయం: నిర్భయ తల్లి

హైదరాబాద్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఉందంతం.. అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్ పై ఢిల్లీలో అత్యాచార బాధితురాలు నిర్భయ తల్లి స్పందించారు. డాక్టర్ దిశ కుటుంబానికి త్వరగా న్యాయం జరిగిందని నిర్భయ తల్లి ఆశా దేవి అన్నారు.
డాక్టర్ దిశ మీద జరిగిన అఘాయిత్యం చాలా ‘అనాగరికమైనది’ అని ఆమె కుటుంబానికి న్యాయం జరిపించడానికి ఏడు సంవత్సరాలు తీసుకోని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె అభినందించారు.
నిర్భయ కేసులో న్యాయం కోసం ఏడు సంవత్సరాలుగా మా కుటుంబం పోరాడుతుందని, మాకులా కాకుండా దిశ కుటుంబానికి సత్వర న్యాయం జరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు.
నిర్భయ ఘటనలో నిందితులకు శిక్ష పడాలని ఏడేళ్ల నుంచి పోరాడుతున్నట్లు ఆమె చెప్పారు. దిశ తల్లిదండ్రులకు ఏడు రోజుల్లో న్యాయం జరగడంని స్వాగతించారు. తెలంగాణ పోలీసుల చర్యను అభినందించారు నిర్భయ తల్లి.