Heavy rainfall in Telangana: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్ కరీంనగర్, ములుగు, వరంగల్, రంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు.

Heavy rainfall in Telangana: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

Updated On : September 30, 2022 / 7:14 AM IST

Heavy rainfall in Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో  కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్ కరీంనగర్, ములుగు, వరంగల్, రంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు.

నిన్న కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుంగతుర్తి మండలంలో 10.58 సెంటీమీటర్ల వర్షం పడింది. పలు జిల్లాల్లో వాన నీరు రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. సూర్యాపేటలో భారీ వర్షం పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెన్‌పహాడ్‌ మండలంలో చెరువులు, కుంటలు నిండాయి.

అర్వపల్లిలో మండలంలోని గ్రామాల్లోని చెరువులు పూర్తిగా నిండి అలుగులు పోస్తున్నాయి. దేవరకొండ పట్టణంలోని ఆయప్పనగర్‌ తుల్చమ్మకుంట సమీపంలో ఒకరి ఇంటిపై పిడుగు పడి, ఆ ఇంట్లోని ఎలక్ట్రానిక్‌ వస్తువులు కాలిపోయాయి. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా వర్షాలు పడుతున్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..