మస్కట్ లో రోడ్డు ప్రమాదం : ముగ్గురు హైదరాబాదీలు మృతి

  • Published By: chvmurthy ,Published On : September 15, 2019 / 01:44 AM IST
మస్కట్ లో రోడ్డు ప్రమాదం : ముగ్గురు హైదరాబాదీలు మృతి

Updated On : September 15, 2019 / 1:44 AM IST

మస్కట్ లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాద్  వాసులు మరణించారు. నగరంలోని సాలార్జంగ్ కాలనీకి చెందిన గౌసుల్లా (30) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా దుబాయ్ లో గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు.  భార్య ఆయేషా(25) కుమార్తె హానీయా (4), కుమారుడు హమ్జా (12 నెలలు)తో కలిసి శుక్రవారం రాత్రి  కారులో ఒమన్ లోని మస్కట్ కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.  

వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వేరొక వాహనం వచ్చి ఢీ కొట్టటంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. గౌసుల్లాతో పాటు భార్య  ఆయేషా, కుమారుడు హమ్జా ప్రమాద స్ధలంలోనే మరణించారు. కుమార్తె హానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్ధితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. 

గౌసుల్లా తండ్రి  అజ్మతుల్లాఖాన్ వరంగల్ కు చెందిన వారు. వీరి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ లోని  టోలిచౌక్ సాలార్ జంగ్ కాలనీలోనే నివాసం ఉంటున్నారు.