బిగ్ బ్రేకింగ్ : సమ్మె విరమణకు సిద్ధమన్న ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా అనుకూల వాతావరణం కల్పిస్తే సమ్మె విరమిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు.

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 12:04 PM IST
బిగ్ బ్రేకింగ్ : సమ్మె విరమణకు సిద్ధమన్న ఆర్టీసీ జేఏసీ

Updated On : November 20, 2019 / 12:04 PM IST

ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా అనుకూల వాతావరణం కల్పిస్తే సమ్మె విరమిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు.

ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఎలాంటి షరతులు లేకుండా అనుకూల వాతావరణం కల్పించి కార్మికులను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకుంటేనే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. సమ్మెకు ముందున్న పరిస్థితులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలను లేబర్ కోర్టుకు ప్రభుత్వం సత్వరమే నివేదించాలన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని ఓ ఆదర్శ ఉద్యోగ సంస్థగా చూడాలని హైకోర్టు సూచించిందని గుర్తు చేశారు. కార్మికుల సమ్మె ఉద్దేశం సమస్యల పరిష్కారానికే తప్ప విధులను విడిచిపెట్టడం కాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరణగా చూపడం జరిగిందన్నారు. 

హైకోర్టు తుది తీర్పుపై సమీక్షించుకున్నామని, సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని అశ్వత్థామరెడ్డి చెప్పారు. షరతులు లేకుండా కార్మికులను విధుల్లో చేర్చుకుంటేనే సమ్మె విరమిస్తామన్నారు. కార్మికులు ఎలాంటి పేపర్లు, షరతులపై సంతకాలు పెట్టరని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును గౌరవించే బాధ్యత ఇరుపక్షాలకు ఉందన్నారు. కోర్టు తీర్పు తర్వాత తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి అన్నారు.

బుధవారం (నవంబర్ 20, 2019) హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు. హైకోర్టు తీర్పు, భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. సమ్మెపై కీలక ప్రకటన చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం(నవంబర్ 19,2019) ఆర్టీసీ కార్మిక సంఘాలు వేర్వేరుగా సమావేశమయ్యాయి. కార్మికుల అభిప్రాయాలను సేకరించారు. వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. కోర్టు తీర్పును పరిశీలించాకే సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన జేఏసీ.. సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామంది. ప్రభుత్వం, యాజమాన్యం ఆ దిశగా సత్వరమే చర్య తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. 

సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం తన స్పందన తెలిపింది. కార్మికులు విధుల్లో చేరాలంటే నిబంధనలు పాటించాల్సిందే అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రభుత్వ నిబంధనలకు లోబడే డ్యూటీలో చేరాలని స్పష్టం చేసింది. ఆర్టీసీ జేఏసీ బేషరతు డిమాండ్ ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని వెల్లడించింది. అలాగే సమ్మె కాలానికి జీతాలు చెల్లించేది లేదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.

jac