నిందితుల ఎన్ కౌంటర్ సరైన నిర్ణయం : దిశ సోదరి

దిశ నిందితుల ఎన్ కౌంటర్ సరైన నిర్ణయమని ఆమె సోదరి అన్నారు. దిశకు న్యాయం జరిగిందన్నారు.

  • Published By: veegamteam ,Published On : December 6, 2019 / 03:41 PM IST
నిందితుల ఎన్ కౌంటర్ సరైన నిర్ణయం : దిశ సోదరి

Updated On : December 6, 2019 / 3:41 PM IST

దిశ నిందితుల ఎన్ కౌంటర్ సరైన నిర్ణయమని ఆమె సోదరి అన్నారు. దిశకు న్యాయం జరిగిందన్నారు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ సరైన నిర్ణయమని ఆమె సోదరి అన్నారు. దిశకు న్యాయం జరిగిందన్నారు. యావత్ దేశం తమకు అండగా నిలబడిందని చెప్పారు. ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థపై పూర్తి నమ్మకముందన్నారు. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలన్నారు. అమ్మాయిలు తక్కువ, అబ్బాయిలు ఎక్కువనే భేదాభిప్రాయం ఉండకూడదన్నారు. ఇంటి నుంచే మార్పు రావాలన్నారు. అమ్మాయిలకు ఎలా మర్యాదు ఇవ్వాలో అబ్బాయిలకు చెప్పాలన్నారు. విద్యావ్యవస్థలో విలువలను పెంచాలన్నారు. సొసైటీలోని ప్రతీ ఒక్కరిలో మార్పు రావాలన్నారు. 

అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా చూపకూడదన్నారు. ఆడవాళ్లతో ఎలా నడుచుకోవాలో అబ్బాయిలకు నేర్పాలని చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం త్వరగా పరిష్కారం అయ్యేవిధంగా తీర్మానం చేయాలన్నారు. పోలీసులు విద్యాసంస్థలకు వెళ్లి విద్యార్థుల్లో అవగాహన పెంచాలన్నారు. పోలీసులంటే భయం ఉంటుందన్నారు. ఆడపిల్లల్లో పోలీస్ వ్యవస్థ, భద్రతా చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు. 

ఘటన జరిగిన రోజు పోలీసులకు కాల్ చేయాలనే ఆలోచన రాలేదన్నారు. పరిస్థితి అంత దారుణంగా ఉందని ఊహించలేక పోయానని తెలిపారు. పోలీసులు స్కూల్స్ కు వెళ్లి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆపద వస్తే మేమున్నామనే భరోసా విద్యార్థులు, ప్రజల్లో పోలీసులు కల్పించాలని కోరారు. ఏ కుటుంబానికి ఇలా జరుగకూడదని అనుకుంటున్నానని తెలిపారు. బయటికి వెళ్లినప్పుడు అమ్మాయిలు అలర్ట్ గా ఉండాలన్నారు.

అంతకముందు దిశ తండ్రి మీడియాతో మాట్లాడుతూ కొడుకు లేని లోటు తీర్చిందన్నారు. దిశకు న్యాయం జరుగుతుందా లేదా అనే ఆందోళన ఉండేదన్నారు. ఈ సంఘటన తరువాత రేప్ చేయడానికి భయపడాతరని చెప్పారు. ఆ నలుగురు తమకు కడుపు కోత మిగిల్చారని…వారి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చారని తెలిపారు. ప్రెషన్ నుంచి ఇంకా కోలుకోలేదన్నారు.
 
అన్ని వ్యవస్థలో మార్పు రావాలని కోరారు. టెక్నాలజీ అప్ డేట్ కావాలన్నారు. పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలన్నారు. విద్యార్థులు కూడా తల్లిదండ్రుల మాట వినాలన్నారు. వేస్ట్ టైమ్ లో బయట తిరుగకూడదని సూచించారు. డ్యూటీలు ముగించుకుని త్వరంగా ఇంటికి రావాలన్నారు. తల్లిదండ్రులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. 

ఆడపిల్లల్లో పోలీసు వ్యవస్థ పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఆడపిల్లలను టచ్ చేస్తే చస్తామనే భయం కలగాలన్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లే వారిని పోలీసులు గౌరవించాలని చెప్పారు. ఎవరైనా అన్యాయం జరిగిందంటే…అది తమకు జరిగినట్లు పోలీసులు భావించాలన్నారు. అప్పుడే పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు.