ప్రేమ విఫలమై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : August 15, 2020 / 12:29 PM IST
ప్రేమ విఫలమై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

Updated On : August 15, 2020 / 3:19 PM IST

ప్రేమ విఫలమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, కృష్ణమూర్తి అన్నదమ్ములు. బతుకుదెరువు కోసం ఇద్దరూ హైదరాబాద్ వచ్చారు. శ్రీనివాసులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా, కృష్ణమూర్తి ప్రైవేట్ కంపెనీలోనూ‌ ఉద్యోగం చేస్తు గచ్చి బౌలిలోని సుదర్శన్ నగర్ లో నివాసం ఉంటున్నారు.



కృష్ణమూర్తి గురువారం ఉదయం డ్యూటీకి వెళ్లగా శ్రీనివాసులు(27) ఇంట్లోనే ఉన్నాడు. గురువారం రాత్రి గం.8-30 సమయంలో కృష్ణమూర్తి తన విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు వేసే ఉన్నాయి. ఎంత సేపు తలుపు కొట్టినా తీయకపోవటంతో ఇరుగు పొరుగు వారి సహాయంతో తలుపులు  పగలగొట్టి  లోపలకు వెళ్ళి చూడగా శ్రీనివాసులు ఉరి వేసుకుని కనిపించాడు.



108 సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి పరిశీలించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కృష్ణమూర్తిని విచారించారు. శ్రీనివాసులు ఓ యువతిని ప్రేమించాడని, ప్రేమ విఫలం కావడంతో మనస్తాపంతో కొద్దిరోజులుగా బాధ పడుతున్నాడని చెప్పాడు. ఆబాధలోనే ఆత్నహత్య చేసుకుని ఉంటాడని భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.