కట్టలు తెగుతున్నాయ్ : లంగర్ హౌస్ లో రూ.2.40 కోట్లు పట్టివేత

పోలింగ్ టైం దగ్గరపడింది. నోట్ల కట్టలు తెగుతున్నాయి. కోట్లకు కోట్లు బయటకు వస్తోంది.

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 06:49 AM IST
కట్టలు తెగుతున్నాయ్ : లంగర్ హౌస్ లో రూ.2.40 కోట్లు పట్టివేత

Updated On : April 9, 2019 / 6:49 AM IST

పోలింగ్ టైం దగ్గరపడింది. నోట్ల కట్టలు తెగుతున్నాయి. కోట్లకు కోట్లు బయటకు వస్తోంది.

పోలింగ్ టైం దగ్గరపడింది. నోట్ల కట్టలు తెగుతున్నాయి. కోట్లకు కోట్లు బయటకు వస్తోంది. అన్నీ 2వేలు, 500 నోట్లే. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం హైదరాబాద్ సిటీ లంగర్ హౌస్ లో ఓ కారులో 2 కోట్ల 40 లక్షల డబ్బు పట్టుకున్నారు పోలీసులు. టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో భాగంగా ఓ కారులో తరలిస్తున్న ఈ డబ్బు కంట పడింది. నగదు తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్దీ.. తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. చాలా ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ చెకింగ్స్ చేస్తున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో ఇప్పటి వరకే రూ.26 కోట్ల అదనంగా పట్టుబడింది. ఇదంతా హవాలా డబ్బేనని పోలీసులు అంటున్నారు. ఈస్ట్, వెస్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా అర్థరాత్రి చేపట్టిన తనిఖీలలో భారీగా నగదు పట్టుబడింది. పట్టుబడిన ఈ భారీ నగదును ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు ఆధ్వర్యంలో పంచనామాను పూర్తి చేశారు పోలీసులు. 

నారాయణగూడలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తల నుంచి రూ. 8 కోట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
Read Also : వరుణ్ గాంధీకి వరుణ్ గాంధీ ఎఫెక్ట్: 2014లో 14వేల 21ఓట్లు.. ఏపీలో కూడా ఇదే జరిగితే!