టీఆర్ఎస్ బలం 100: ఆ ఒక్కరు కారెక్కేశారు

గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి నెగ్గిన తెలుగుదేశం పార్టీ ఏకైక కార్పొరేటర్ మందడి శ్రీనివాస్ కారెక్కేశారు. 2016లో జరిగిన గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో 99 చోట్ల గులాబీ జెండా ఎగరగా.. కేపీహెచ్‌బీలో మాత్రం టీడీపీ అభ్యర్ధి మందడి శ్రీనివాస్ విజయం సాధించారు. అయితే మందాడి శ్రీనివాస్‌ను అప్పటి నుంచి పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ, ఆయన టీఆర్ఎస్‌కు వెళ్లలేదు.
Read Also : రాహుల్ పీఎం కాగానే భార్యకు భరణం ఇస్తా : కోర్టులో భర్త వాదన
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనంతో టీడీపీ కోలుకోదు అని భావించిన మందాడి శ్రీనివాస్.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. కేపీహెచ్‌బీ ప్రాంతంలో ముందస్తు తెలంగాణ ఎన్నికల్లో కూడా కూకట్‌పల్లి నుంచి పోటీ చేసి గెలిచిన మాధవరం కృష్ణారావుకు పెద్దగా ఓట్లు పోలవ్వలేదు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా అక్కడ ఓట్లు రాబట్టాలని, మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి టీడీపీ కార్యకర్తల మద్దతు లేకుండా చేయాలని పథకం ప్రకారం.. కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్‌ను కారెక్కేలా చేసినట్లు తెలుస్తుంది.
తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి పోటీ చేసేందుకు మందాడి శ్రీనివాస్ సిద్దం అవగా నందమూరి సుహాసిని రంగ ప్రవేశం చేయడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే టీఆర్‌ఎస్‌లో చేరతారని అప్పుడే ప్రచారం జరిగింది. ఇటీవల రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించిన మందాడి శ్రీనివాస్.. అనూహ్యంగా పార్టీ మారిపోయారు. కాగా మందాడి శ్రీనివాస్ చేరికతో టీఆర్‌ఎస్ గ్రేటర్ కార్పోరేటర్ల బలం 100కు చేరుకుంది.
Read Also : కాంగ్రెస్‌కి బిగ్ షాక్ : పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజీనామా