తెలంగాణ అసెంబ్లీ : రూ. 3లక్షల కోట్ల అప్పులు చేశారు – భట్టి

తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించారని, మూడు లక్షల కోట్ల అప్పులు కేవలం ఆరు సంవత్సరాల్లో చేయబోతోందని సభలో వెల్లడించారు. ఇంత అప్పు రాష్ట్రానికి భారం కాదా అంటూ ప్రశ్నించారు. సెప్టెంబర్ 14వ తేదీ శనివారం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన బుక్‌లో ఉన్న అంశాలను మాత్రమే తాను వివరించడం జరుగుతోందని, రూ. 77 వేల కోట్ల 324 కోట్లు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చిందని తెలిపారు. అప్పు కట్టాల్సింది..కార్పొరేషన్ కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న బడ్జెట్‌లో అప్పులు తీసుకొస్తామని చెప్పారన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటే..కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందే అవకాశం ఉండేదన్నారు.
కొన్ని లక్ష్యాల కోసం..రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని గుర్తు చేశారు మల్లు భట్టి విక్రమార్క. ఉద్యోగాలు, ఇళ్లు, భూమి వస్తుందని ప్రజలు ఆశించారని, ఎక్కడా ప్రియార్టీస్ కనిపించడం లేదని విమర్శించారు. మిగులు రాష్ట్రాన్ని ఆరు సంవత్సరాలు వచ్చేసరికి ప్రభుత్వం చేతులేత్తిసిందని ఎద్దేవా చేశారు. హాస్యాస్పద రాష్ట్రంగా మార్చారంటూ చెప్పారు. మిగులు బడ్జెట్, మంచి వనరులు ఉన్నాయని..త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే..రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందేదని భట్టి సభకు వివరించారు. వీటిని సీఎం కేసీఆర్ ఖండించారు.
Read More : గుడ్ న్యూస్ : కరీంనగర్, మహబూబ్ నగర్ లో ఐటీ టవర్