Telangana Cabinet: వచ్చే నెల 3న కేసీఆర్‌ నేతృత్వంలో కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వచ్చే నెల 3న కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రగతి భవన్​లో ఈ సమావేశం జరగనుందని తెలంగాణ సీఎంవో ప్రకటించింది. శాసనసభ సమావేశాల నిర్వహణపై ఇందులో కేసీఆర్ మంత్రులతో కలిసి చర్చిస్తారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 15న ముగిసిన విషయం తెలిసిందే. వచ్చే నెల 14 లోపు అసెంబ్లీ మళ్ళీ సమావేశం కావాలి.

Telangana Cabinet: వచ్చే నెల 3న కేసీఆర్‌ నేతృత్వంలో కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం

Telangana Cabinet

Updated On : August 30, 2022 / 11:34 AM IST

Telangana Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వచ్చే నెల 3న కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రగతి భవన్​లో ఈ సమావేశం జరగనుందని తెలంగాణ సీఎంవో ప్రకటించింది. శాసనసభ సమావేశాల నిర్వహణపై ఇందులో కేసీఆర్ మంత్రులతో కలిసి చర్చిస్తారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 15న ముగిసిన విషయం తెలిసిందే. వచ్చే నెల 14 లోపు అసెంబ్లీ మళ్ళీ సమావేశం కావాలి.

వాటి నిర్వహణ తేదీలపై కేబినెట్ మావేశంలో కేసీఆర్ చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన అంశాలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేపు బిహార్‌లో కేసీఆర్‌ పర్యటించనున్నారు. గల్వాన్ లోయల్లో మరణించిన సైనికుల కుటుంబాలతో పాటు సికింద్రాబాద్ టింబర్ డిపోలో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం చేస్తారు.

రేపు ఉదయం హైదరాబాద్ నుంచి పట్నాకు బయలుదేరతారు. కాగా, ఆంధ్రప్రదేశ్ కి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై ఇవాళ ప్రగతిభవన్ లో కేసీఆర్ సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సమావేశం అనంతరం పలు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

COVID 19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 6 వేల కన్నా తక్కువగా నమోదు