తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీ

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ బదిలీ అయ్యారు. కోల్ కతా హైకోర్టు చీఫ్ జిస్టిస్ గా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. జనవరి 1వ తేదీన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేశారు.
గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఏకే సిక్రీ, జిస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన కొలీజియం సమావేశమై జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపింది. దీనిపై నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. ఆయన స్థానంలో జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీనియారిటీలో రెండు స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.