లాక్‌డౌన్‌లోనూ అందుబాటులో ఉండే సేవలివే

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో విశేష అధికారాల కోసం అమలు చేసే అంటురోగాల

  • Published By: veegamteam ,Published On : March 23, 2020 / 01:18 PM IST
లాక్‌డౌన్‌లోనూ అందుబాటులో ఉండే సేవలివే

Updated On : March 23, 2020 / 1:18 PM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో విశేష అధికారాల కోసం అమలు చేసే అంటురోగాల

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణలోనూ పంజా విసురుతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 33కి చేరింది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో విశేష అధికారాల కోసం అమలు చేసే అంటురోగాల నియంత్రణ చట్టం-1897ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. లాక్‌డౌన్‌ అంటే ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకూడదు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప. ప్రతి ఒక్కరు ఈ నిబంధన కచ్చితంగా పాటించాలి. 

కొన్ని వర్గాలకు మాత్రం ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ముఖ్యంగా ఆహారం కోసం రెస్టారెంట్లు, హోటళ్లపై ఆధారపడే వారికి ఇబ్బంది లేకుండా టేక్‌ అవే, హోం డెలివరీకి హోటళ్లకు అనుమతినిచ్చింది. దీంతో బ్యాచిలర్స్‌, హాస్టల్‌ వసతి అందుబాటులో లేని వాళ్లకు కాస్త ఊరట లభించింది.

లాక్‌డౌన్‌లోనూ అందుబాటులో ఉండే సేవలు:
* బ్యాంకులు, ఏటీఏంలకు సంబంధించిన కార్యకలాపాలు
* ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా
* టెలికాం, పోస్టల్‌, ఇంటర్నెట్‌ సర్వీసులు
* అత్యవసర వస్తువుల సరఫరా
* ఫుడ్‌, ఫార్మాసుటికల్‌, వైద్య పరికరాలకు సంబంధించిన ఈ- కామర్స్‌ సేవలు
* ఆహార ఉత్పత్తులు, కూరగాయలు, పాలు, పండ్లు, బ్రెడ్‌, కిరాణా సామాన్లు, కోడిగుడ్లు, మాంసం, చేపలు తదితరాల రవాణా
* రెస్టారెంట్ల టేక్‌ అవే, హోం డెలివరీ సేవలు
* ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్‌ సెంటర్లు, ఆప్టికల్‌ స్టోర్లు, ఫార్మసుటికల్స్‌ తయారీ- రవాణా
* పెట్రోలు పంపులు, ఎల్పీజీ గ్యాస్‌, ఆయిల్‌ ఏజెన్సీలు అందుకు సంబంధించిన గోడౌన్లు, రవాణా
* భద్రతా సిబ్బంది (‍ప్రైవేటు సంస్థలు సహా)
* కొవిడ్‌-19ను కట్టడి చేసేందుకు అత్యవసర సేవలు అందించే అన్ని ప్రైవేటు సంస్థలు
* ఎయిర్‌పోర్టులు, సంబంధిత కార్యకలాపాలు

నిరంతరాయంగా పనిచేసే ప్రభుత్వ సంస్థలు:
* జిల్లా కలెక్టరేట్‌, డివిజన్‌, మండల కార్యాలయాలు
* పోలీసు వ్యవస్థ
* వైద్య సిబ్బంది
* స్థానిక సంస్థలు, పంచాయతీలు
* అగ్నిమాపక సిబ్బంది
* ఎక్సైజ్‌, కమర్షియల్‌ ట్యాక్సు, రవాణా, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల సిబ్బంది
* విద్యుత్‌, నీటి సరఫరా కార్యాలయాలు
* వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మత్స సంవర్ధక, వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థ
* పౌర సరఫరాలు
* కాలుష్య నివారణ మండి, లీగల్‌ మెట్రాలజీ, డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌
* కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమయ్యే అన్ని ప్రభుత్వ సంస్థలు