కశ్మీర్ సమస్య కు పరిష్కారం కేసిఆర్ చూపగలరు

భారత్ పై కుట్రపూరితంగా హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఉగ్రమూకకు బుద్ధిచెప్పిన వాయుసేనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చెప్పారు. కశ్మీర్ సమస్యకు మూల కారణం కాంగ్రెస్ పార్టీనేనని, నెహ్రు విధానాలతోనే ఈ సమస్య పుండుగా మారిపోయిందని ఆయన అన్నారు. కశ్మీర్‌కు తెలంగాణకు సారూప్యతలు ఉన్నాయని, ఈ రెంటికీ కారణమైంది నెహ్రూనేనంటూ విమర్శించారు. కేసీఆర్ వంటి స్థిరమైన ఆలోచన కలిగిన నాయకుడి ద్వారానే కశ్మీర్‌కు పరిష్కారం లభిస్తుందని, రానున్న రోజుల్లో కేసీఆర్‌కు కేంద్రాన్ని ప్రభావితం చేసే అవకాశం వస్తే కశ్మీర్‌తోపాటు అయోధ్య రామమందిరం సమస్యకూ పరిష్కారం చూపగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also : దరిద్రం పట్టిస్తున్నావ్ : TikTokకు రూ.40కోట్ల జరిమానా
రామమందిరాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లతోనే భూమి పూజ చేయించి,కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించేలా చేయగలరని, కేసీఆర్ వంటి సీనియర్ నాయకులను ఈ విషయంలో కేంద్రం సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రకటించిన ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ సాధ్యం కాలేదని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ‘కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ’ మాత్రం ఖాయమంటూ బూర నర్సయ్యగౌడ్ జోస్యం చెప్పారు. ఒక్క విజిల్ వేస్తే టీఆర్ఎస్ లో చేరడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారని, కేసీఆరే అనుమతించట్లేదని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా ఉన్నారే తప్ప ఏనాడూ తెలంగాణ గురించి పార్లమెంట్‌లో మాట్లాడలేదన్నారు.
Read Also : కశ్మీర్ సమస్య కు పరిష్కారం కేసిఆర్ చూపగలరు