కాంగ్రెస్ నేతల కడుపులు మండుతున్నాయి : కేటీఆర్ 

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 08:54 AM IST
కాంగ్రెస్ నేతల కడుపులు మండుతున్నాయి : కేటీఆర్ 

Updated On : August 27, 2019 / 8:54 AM IST

హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్  స్టేడియంలో  టీఆర్ ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించారు.
ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వరాష్ట్రం సాధించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ గారి ఆధ్వరంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారనీ..వాటి ద్వారా వచ్చిన నీటితో రైతన్నలు బంగారు పంటల్ని పండించుకుంటుంటే కాంగ్రెస్ నేతలు కడుపు మండిపోతోందని కేటీఆర్ విమర్శించారు. అన్నింటిలోనే అభివృద్ధి దిశగా సాగిపోతున్న తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత మన రాష్ట్రానిదేనన్నారు. 

దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఐదేళ్లలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశమే అబ్బురపడే విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాకనీ..కరెంట్ కోతలతో చీకటిమయంగా ఉండే రాష్ట్రాన్ని 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు.  చెన్నైలో తాగునీటి సమస్య ఎంతగా ఉందో వేసవిలో చూశాం..రైళ్లద్వారా నీటిని తెప్పించుకుని తాగాల్సిన దుస్థితి ఉంది. కానీ తాగునీటిసమస్యలు ఉండే తెలంగాణలో నీటి సమస్య అనే మాటే వినబడకుండా చేసుకున్నామనీ ఇదంతా మన సీఎం చేసిన కృషేనని అన్నారు. 

గతంలో ఎండాకాలం వస్తే జలమండలి కార్యాలయం ముందు ప్రదర్శనలు జరిగేవి. నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. గతంలో నిజాంపేట, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 14 రోజులకోసారి నీళ్లు వచ్చేవి. ఇప్పుడు నిజాంపేట, కుత్బుల్లాపూర్‌లో రెండు రోజులకోసారి నీళ్లిస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.