చల్లని కబురు : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
ఎండలతో మాడిపోతున్న తెలుగు రాష్ట్రా ప్రజలకు వరుణుడు చల్లని జల్లులతో సేదతీర్చాడు. గత కొన్ని రోజుల వరకూ భానుడు ప్రతాపంతో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకున్నాయి.

ఎండలతో మాడిపోతున్న తెలుగు రాష్ట్రా ప్రజలకు వరుణుడు చల్లని జల్లులతో సేదతీర్చాడు. గత కొన్ని రోజుల వరకూ భానుడు ప్రతాపంతో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకున్నాయి.
హైదరాబాద్: ఎండలతో మాడిపోతున్న తెలుగు రాష్ట్రా ప్రజలకు వరుణుడు చల్లని జల్లులతో సేదతీర్చాడు. గత కొన్ని రోజుల వరకూ భానుడు ప్రతాపంతో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. కానీ సడెన్ గా వాతావరణం చల్లబడటం..చల్లని గాలులు వీస్తు..చిరుజల్లులు పలకరించాయి. మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Read Also : కరువు వెక్కిరిస్తోంది : చెన్నైవాసుల తాగునీటి కష్టాలు తప్పేనా?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మంగళ, బుధవారాల్లో (ఏప్రిల్ 10,11) అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే మంగళవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు చెప్పారు.
రెండురోజుల వరకు గ్రేటర్ హైదరాబాద్, రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వడదెబ్బ కారణంగా నిర్మల్, కామారెడ్డి, వరంగల్ రూరల్ జిల్లాల్లో ముగ్గురు మృతి చెందారు.
Read Also : నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను