Mundra Port Work Resumes: తుపాన్ తర్వాత ముంద్రా పోర్టులో కార్యకలాపాలు ప్రారంభం..కరణ్ అదానీ ట్వీట్

బిపర్‌జోయ్ తుపాన్ తీరం దాటాక ముంద్రా పోర్టులో ఓడల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. తుపాన్ వల్ల ముంద్రా ఓడరేవులో నిలిచి పోయిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. తుపాన్ అనంతరం శనివారం మొదటి నౌక తమ ఓడరేవుకు వచ్చిందని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ తెలిపింది.....

Mundra Port Work Resumes: తుపాన్ తర్వాత ముంద్రా పోర్టులో కార్యకలాపాలు ప్రారంభం..కరణ్ అదానీ ట్వీట్

ముంద్రా పోర్టులో ఓడల రాకపోకలు ప్రారంభం

Updated On : June 18, 2023 / 8:50 AM IST

After Halt For Cyclone Mundra Port Work Resumes: బిపర్‌జోయ్ తుపాన్ తీరం దాటాక ముంద్రా పోర్టులో ఓడల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. తుపాన్ వల్ల ముంద్రా ఓడరేవులో నిలిచి పోయిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. పశ్చిమ తీరంలోని గుజరాత్‌ రాష్ట్రంలోని ముంద్రా ఓడరేవులో తుపాను కారణంగా ఓడల రాకపోకలను నిలిపివేశారు. తుపాన్ అనంతరం శనివారం మొదటి నౌక తమ ఓడరేవుకు వచ్చిందని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ తెలిపింది.(Adani Group)

Five earthquakes jolt Jammu and Kashmir: కశ్మీరులో కలకలం..24 గంటల్లో ఐదు భూకంపాలు

‘‘ఈ రోజు మొదటి నౌక ఓడరేవుకు వచ్చింది, తిరిగి పోర్టులో కార్యకలాపాలు శనివారం నుంచి పునఃప్రారంభించాం’’అని అదానీ పోర్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కరణ్ అదానీ ట్వీట్‌ చేశారు.(Tweet) గుజరాత్ రాష్ట్రం కచ్ ప్రాంతంలోని ఓడరేవుల్లో జూన్ 12వతేదీ నుంచి తుపాన్ హెచ్చరికలతో కార్యకలాపాలను నిలిపివేశారు.తుపాన్ అనంతరం గల్ఫ్‌లోని అన్ని ఓడరేవులు శనివారం నుంచి సాధారణ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని గుజరాత్ మారిటైమ్ బోర్డు చీఫ్ నాటికల్ ఆఫీసర్ అశ్విన్ సోలంకి తెలిపారు.