Rishabh Pant: రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఆలయంలో భారత క్రికెటర్ల పూజలు

కారు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో పలువురు భారత క్రికెటర్లు పూజల్లో పాల్గొన్నారు. దేవదేవుడు శివుడికి ఇచ్చే ‘భస్మ హారతి’కి కూడా వారు హాజరయ్యారు. రేపు మధ్యప్రదేశ్ లోని ఇండోర్, హోల్కర్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే జరగనుంది.

Rishabh Pant: రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఆలయంలో భారత క్రికెటర్ల పూజలు

Rishabh Pant

Updated On : January 23, 2023 / 2:04 PM IST

Rishabh Pant: కారు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో పలువురు భారత క్రికెటర్లు పూజల్లో పాల్గొన్నారు. దేవదేవుడు శివుడికి ఇచ్చే ‘భస్మ హారతి’కి కూడా వారు హాజరయ్యారు. రేపు మధ్యప్రదేశ్ లోని ఇండోర్, హోల్కర్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే జరగనుంది.

ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు మధ్యప్రదేశ్ లో ఉన్నారు. ఇవాళ ఉదయం సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ భారత క్రికెట్ టీమ్ కు చెందిన కొందరు సిబ్బందితో కలిసి మహాకాళేశ్వర ఆలయానికి వెళ్లారు. సంప్రదాయ దుస్తుల్లో వారంతా మందిరానికి వెళ్లారు. రిషబ్ పంత్ త్వరగా కోలుకుని జట్టులో చేరాలని దేవుడిని ప్రార్థించామని సూర్యకుమార్ యాదవ్ మీడియాకు చెప్పాడు.

అతడు తిరిగి జట్టులో చేరడం తమకు చాలా ముఖ్యమని చెప్పాడు. రేపటి మ్యాచు గురించి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇప్పటికే సిరీస్ గెలిచామని, ఫైనల్ మ్యాచులోనూ ఆడేందుకు ఎదురుచూస్తున్నామని అన్నాడు. కాగా, కొన్ని రోజుల క్రితం రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. మరోవైపు, న్యూజిలాండ్ తో రేపటి మూడో వన్డే అనంతరం, టీ20 సిరీస్ జరగనుంది.

Ludo Game Love: ‘లూడో గేమ్’ కలిపింది ఇద్దరిని.. భారతీయుడితో ప్రేమలో పడి దేశం దాటొచ్చిన పాక్ యువతి.. ఇద్దరూ అరెస్ట్