Funny Tweet : పెళ్లికి పిలిచినట్లా? పిలవనట్లా? మీకూ.. డౌట్ వస్తుంది
ఇంటర్నెట్‌లో రీల్స్, డ్యాన్సులు వేసి మాత్రమే వైరల్ అవ్వనక్కర్లేదు.. కొన్ని ఫన్నీ డౌట్స్ కూడా పోస్ట్ చేసి ఫన్ క్రియేట్ చేయచ్చు. ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారి మిలియన్ల వ్యూస్ సంపాదించింది.

Wedding Invitation Tweet
Funny Tweet : ఏదైనా పార్టీకి గానీ, పెళ్లికి గానీ స్నేహితులు, బంధువులు ఆహ్వానిస్తూ ఉంటారు. సరిగ్గా పిలవలేదనో.. జస్ట్ మెసేజ్ పెడితే వెడతారా? అనో.. ఇంట్లో అందరికీ చెప్పి నాకు చెప్పలేదనో.. అలిగి .. కోపగించి కొన్ని వేడుకలకు వెళ్లడం మానేస్తాం. ఇక ఇటీవల కాలంలో కొన్ని ఇన్విటేషన్స్ వైరల్ అవ్వడం కోసం విచిత్రంగా కూడా ఉంటున్నాయి. ఇక విషయానికి వస్తే ఓ ట్వీట్ ఇప్పుడు మిలియన్ల సంఖ్యలో దూసుకుపోతోంది. ఆ ట్వీట్‌లో మేటర్ ఏంటంటే పెళ్లికి పిలిచినట్లా? పిలవనట్లా? అర్ధం కాని ఓ ఇన్విటేషన్ గురించి ఒకరు బుర్ర బద్దలు కొట్టుకుని ఫైనల్ గా ఏం చేశారు? చదవండి.
non aesthetic things అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఓ ఫన్నీ మెసేజ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో ఏముంది అంటే? ఇటీవలే ఓ పెళ్లి శుభలేఖ అందుకున్నారట.అందులో ‘మీరు పెళ్లికి రావడమే మాకు బహుమతి.. మాకు ఎటువంటి గిఫ్ట్స్ అవసరం లేదు’.. అని ఉందట. ఈ మెసేజ్ ని మరల మరల మీరు కూడా చదవండి. పెళ్లికి పిలిచినట్లా? పిలవనట్లా? మీకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది.
SBI Server Down : టెక్నికల్ స్టాఫ్ లంచ్ చేస్తూ ఉండిపోయారేమో?.. SBI కస్టమర్స్ ఫన్నీ జోక్స్ వైరల్
ఈ ఇన్విటేషన్ అందుకున్న వారు మాత్రం కాస్త కన్ఫ్యూజ్ అయ్యి ఫైనల్‌గా పెళ్లికి వెళ్లకూడదు అని నిర్ణయం తీసుకున్నారట. ఈ ట్వీట్‌కి అయితే చాలామంది కామెంట్స్ చేశారు. ‘మీరు పెళ్లికి అటెంట్ కాకపోవడమే వారికి నిజమైన గిఫ్ట్ ఏమో మెయిల్ చేసి అడగండి’ అని ఒకరు.. ‘ఇండియన్స్ ఇచ్చే వెడ్డింగ్ కార్డులలో ఇలా ఉండటం కామనే.. కానీ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది’ అని మరొకరు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ 7.5 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇంతకీ పెళ్లికి పిలిచినట్లా? పిలవనట్లా? మీరు కూడా ఓసారి ఆలోచించండి.
— non aesthetic things (@PicturesFoIder) June 22, 2023